
దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి అర్బన్: వరంగల్‌లోని బీవీ శ్యామల రత్నం పారా మెడికల్ చారిటీ ఆధ్వర్యంలో ఉచిత పారా మెడికల్ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డీఎంపీహెచ్‌ఏ (ఎం), డీఎంఎల్‌టీ, డీఓఏ, డీఆర్‌జీఏ, డీఎంఎస్‌ఓటీలో ఇంటర్ విద్యార్హతతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి ప్రభుత్వ ఆస్పత్రులు, రైల్యే, ఈఎస్‌ఐ, ఆయుష్‌లతో పాటు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు పొందుటకు అర్హులన్నారు. ఆసక్తి గల వారు 9059729000, 9849473179 నంబర్లను సంప్రదించాలని కోరారు.
భూపాలపల్లి అర్బన్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని ప్రతిఒక్కరూ ఖండించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) పట్టణ కార్యదర్శి సోత్కు ప్రవీణ్‌కుమార్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో సీపీఐ నాయకులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌పై దాడికి పాల్పడిన న్యాయవాది రాకేష్‌కిశోర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నారు. ఈదాడికి ప్రధాని మోదీ, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌లు బాధ్యత వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు క్యాతరాజ్ సతీష్, నేరెళ్ల జోసెఫ్, పీక రవి, రవీందర్, జనార్దన్, లావణ్య, రజిత, సంధ్య, శ్రీలత, తదితరులు పాల్గొన్నారు.
కాటారం: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కిరణ్‌ఖరే తెలిపారు. బుధవారం కాటారం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేసుల వివరాలు, సిబ్బంది హాజరు, పలు రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసుల పురోగతిపై స్థానిక పోలీస్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అల్లర్లు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.
కాళేశ్వరం:వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాల ముగింపులో భాగంగా మహాదేవపూర్ బాలుర జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు బుధవారం చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బయాలజీ ఉపాధ్యాయుడు బి.ప్రభాకర్‌రెడ్డి, తిరుపతిరెడ్డిలు మాట్లాడుతూ ఈనెల 2 నుంచి 8వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రతీ జంతువు పర్యావరణ పరిరక్షణలో భాగమేనన్నారు. వాటి సహజ ఆవాసాలను సంరక్షించాల్సిన ఆవశ్యకత ఉందని విద్యార్థులకు వివరించారు. గెలుపొందిన విద్యార్థులకు హెచ్‌ఎం అనిల్ బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఫిజిక్స్ టీచర్ రాజిరెడ్డి, ఉపాధ్యాయులు రాజయ్య, అనిల్, సమ్మయ్య, అనిత, కవిత, కిరణ్ కుమార్, కోటేశ్వర్, శ్రీని వాస్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
కాటారం: మహాముత్తారం మండలకేంద్రంలోని అత్యవసర సేవల 108 అంబులెన్స్‌ను బుధవారం జిల్లా మేనేజర్ రాజునాయక్ తనిఖీ చేశారు. 108 వాహనంలోని రికార్డులు, మెడికల్ స్టాక్, వాహనం కండీషన్ చెక్ చేశారు. అత్యవసర సేవల కోసం వాహనంలో మందులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటూ అందుబాటులో ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. అత్యవసర సేవల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, కాల్ అందుకోగానే ప్రమాద స్థలానికి చేరుకొని బాధితులకు ప్రథమ చికిత్స అందించి దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లాలని తెలిపారు.

దరఖాస్తుల స్వీకరణ