
మొదటి విడతకు సిద్ధం
మొదటి విడతలో జరుగనున్న ఎన్నికల వివరాలు..
భూపాలపల్లి: స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. బీసీ రిజర్వేషన్ల అంశం హైకోర్టులో ఉండగా, నేడు తీర్పు వెలువడనున్న క్రమంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం నేటి నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లను స్వీకరించనున్నారు.
మొదటి దఫాలో 6 మండలాల్లో..
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మూడు విడతల్లో ఎన్నికలు జరుగనుండగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మాత్రం రెండు విడతల్లోనే ఎన్నికలు పూర్తి కానున్నాయి. జిల్లాలోని 12 మండలాల్లో 12 ఎంపీపీ, 12 జెడ్పీటీసీ, 109 ఎంపీటీసీ, 248 సర్పంచ్, 2,102 వార్డు స్థానాలు ఉన్నాయి. ఇందులో మొదటి విడతలో భాగంగా భూపాలపల్లి నియోజకవర్గంలో భూపాలపల్లి మినహా గణపురం, రేగొండ, కొత్తపల్లిగోరి, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 6 జెడ్పీటీసీ, 58 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. నేడు (గురువారం) రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే నామినేషన్లను స్వీకరించనున్నారు. ఇందుకోసం జెడ్పీటీసీలకు 6, ఎంపీటీసీలకు 19 మంది రిటర్నింగ్ అధికారులను కలెక్టర్ రాహుల్ శర్మ నియమించారు. నామినేషన్ల స్వీకరణ ఆయా ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్వహించనుండగా ఇందుకు తగిన ఏర్పాట్లు చేశారు. నామినేషన్ల స్వీకరణ నేటి నుంచి 11వ తేదీ వరకు కొనసాగుతుంది.
నేటి నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ
ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ
6 జెడ్పీటీసీ, 58 ఎంపీటీసీ స్థానాలు
నేడు నోటిఫికేషన్, అనంతరం
నామినేషన్ల స్వీకరణ
మండలం ఎంపీటీసీ పోలింగ్ ఓటర్లు
స్థానాలు కేంద్రాలు
గణపురం 10 58 33,235
రేగొండ 11 63 33,973
కొత్తపల్లి గోరి 6 33 16,446
చిట్యాల 12 59 30,698
టేకుమట్ల 9 44 22,248
మొగుళ్లపల్లి 10 56 30,353