
ప్రచార ఖర్చులు పక్కాగా నమోదు చేయాలి
● అదనపు కలెక్టర్ విజయలక్ష్మి
భూపాలపల్లి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు చేసే ప్రచార ఖర్చులను పక్కాగా నమోదు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి సూచించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్‌లో హాల్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచార ఖర్చులకు సంబంధించి రేట్ చార్ట్ నిర్దేశించు అంశంపై ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీలు, ప్రింటర్స్ అండ్ పబ్లిషర్స్, ఫ్లెక్సీల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఖర్చులను పర్యవేక్షించడానికి రేట్ చార్ట్ రూపొందించినట్లు తెలిపారు. ఈ రేట్ చార్ట్ ప్రకారం, ప్రతీ ప్రచార సామగ్రి, ఫ్లెక్సీ, పోస్టర్, ప్రచార వాహనాల అద్దె, ప్రకటనలు, ఇతర ప్రచార ఖర్చులు స్థానిక రేట్ల ఆధారంగా అభ్యర్థులు ఖర్చులో జమచేయబడతాయని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తగు అనుమతులు పొందాల్సి ఉంటుందని తెలి పారు. ఈ సమావేశంలో ఆడిట్ అధికారి మానస, డీపీఓ శ్రీలత, డీపీఆర్‌ఓ శ్రీనివాస్, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.