
రామాయణం మార్గదర్శక గ్రంఽథం
భూపాలపల్లి: మహర్షి వాల్మీకి రచించిన రామాయణం ప్రతీ మనిషి జీవితానికి మార్గదర్శక గ్రంథం అని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. పర్గత్ దివస్‌ను పురస్కరించుకొని వాల్మీకి జయంతి వేడుకలను మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. మహర్షి వాల్మీకి చూపిన సత్యం, ధర్మం, కర్తవ్యమార్గాలు నేటి సమాజానికి ప్రేరణ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐలు, ఆర్‌ఎస్సైలు, డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు.