
భూ భారతి దరఖాస్తులను పరిష్కరించాలి
కాటారం: భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో భాగంగా స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారం కోసం ఆర్జిదారులకు నోటీసులు జారీ చేయాలని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ ఆదేశించారు. మహాముత్తారం తహసీల్దార్ కార్యాలయాన్ని మంగళవారం అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. భూ భారతి సదస్సుల్లో భాగంగా వచ్చిన దరఖాస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంత మందికి నోటీసులు జారీచేశారని తహసీల్దార్ శ్రీనివాస్ ద్వారా ఆరా తీశారు. త్వరితగతిన నోటీసులు జారీ చేయాలని సూచించారు.
అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్