కాటారం: కాటారం మండలకేంద్రానికి సమీపంలో జాతీయ రహదారిపై గతంలో ఏర్పాటు చేసిన ఫారెస్ట్ చెక్‌పోస్టును మంగళవారం నుంచి పునరుద్ధరించారు. కొంతకాలంగా చెక్‌పోస్టు నిర్వహణలో లేకపోవడంతో అక్రమ కలప రవాణా, ఇతరత్రా అసాంఘీక కార్యక్రమాలు యథేచ్ఛగా కొనసాగుతూ వచ్చాయి. దీంతో అటవీశాఖ ఉన్నతాధికారులు చెక్‌పోస్టు నిర్వహణపై దృష్టిసారించి తిరిగి ప్రారంభించారు. కాళేశ్వరం జోన్ సీసీఎఫ్ డాక్టర్ ప్రభాకర్, డీఎఫ్‌ఓ నవీన్‌రెడ్డి చెక్‌పోస్టును ప్రారంభించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. చెక్‌పోస్టు ద్వారా ఇసుక లారీల నుంచి సెస్ ఫీజు వసూలు చేయనున్నట్లు సీసీఎఫ్ తెలిపారు. అక్రమ రవాణాపై నిరంతర నిఘా కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌డీఓ సందీప్, మహదేవపూర్ రేంజర్ రవి, సిబ్బంది పాల్గొన్నారు.
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
చిట్యాల: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ మల్లేష్ అన్నారు. మంగళవారం మండలంలోని లక్ష్మీపూర్‌తండాలో కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మల్లేష్ మాట్లాడుతూ గ్రామంలో గంజాయి, గుట్కా, గుడుంబా అమ్మినా, కొత్త వ్యక్తులు కనబడినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పారు.
ప్రతి వాహనదారుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని అన్నారు. డయల్ 100, షీ టీమ్స్, సీసీ టీవీ కెమెరాలపై అవగాహన కల్పించారు. అనంతరం నాలుగు బృందాలుగా ఏర్పడి 110 ఇళ్లను తనిఖీ చేయగా ఎనిమిది వాహనాలకు సరైన ధృవపత్రాలు లేకపోవడంతో వాటిని సీజ్ చేసినట్లు చెప్పారు. 350 లీటర్ల గుడంబా పానకం ధ్వంసం చేశారు. పది లీటర్ల గుడుంబాను సీజ్‌చేసి ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్యాల, మొగుళ్లపల్లి ఎస్సైలు శ్రావన్‌కుమార్, అశోక్‌కుమార్, హేమలత, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
కొమురం భీంకు ఘన నివాళి డీడీకి సన్మానం
భూపాలపల్లి రూరల్: కొమురం భీం 85 వర్ధంతిని మంగళవారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ కొమురంభీం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ.. కొమురం భీం అడవి బిడ్డల హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం పోరాటం చేసి నిజాం పాలకులకు సింహస్వప్నం అయ్యాడన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య, నాయకులు కుడుమేత సరస్వతి, ప్రధాన కార్యదర్శి దుబాసి పార్వతి, యూవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపుపాల్గొన్నారు .
తెలంగాణ ఆదివాసీ ఆధ్వర్యంలో..
తెలంగాణ ఆదివాసీ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్ కొమురంభీం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొమురం భీం పోరాట చరిత్రను వివరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రం దేవేందర్, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ నాయకులు శ్రీకాంత్ పాల్గొన్నారు.
ఏటూరునాగారం: ఏటూరునాగారం ఐటీడీఏ డీడీగా పదవీ బాధ్యతలను స్వీకరించిన దబ్బగట్ల జనార్దన్‌ను మంగళవారం ఆయన కార్యాలయంలో ఉమ్మడి జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్స్ సన్మానించారు. గతంలో పనిచేసిన డీడీ పోచం బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో జనార్దన్ విధుల్లో చేరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఓ సారయ్య, ఏసీఎంఓ కోడి రవీందర్, స్పోర్ట్స్ ఆఫీసర్లు యాలం ఆదినారాయణ, వజ్జ నారాయణ, చుంచు కొమ్మాలు పాల్గొన్నారు.

ఫారెస్ట్ చెక్‌పోస్టు పునరుద్ధరణ