
డేంజర్ రోడ్డు
గణపురం: గాంధీనగర్ నుంచి గణపురం మండలకేంద్రంతో పాటు ములుగు జిల్లా వెంకటాపురం మండలం వెల్తుర్లపల్లి వరకు పరకాల–ములుగు ప్రధాన రహదారి డేంజర్‌గా మారింది. గాంధీనగర్ నుంచి వెల్తుర్లపల్లి వరకు సుమారు 9 కిలోమీటర్ల మేరకు ప్రధాన రహదారి పెద్ద గుంతలతో నిండిపోయింది. రహదారి వెంట ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేస్తున్నారు. భారీ వాహనాలతో పాటు కార్లు, ఆటోలలో వెళ్లే ప్రయాణికులు నానాయాతన పడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు, పాలకులు స్పందించి రోడ్డు నిర్మాణం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.