
ఆరు గ్యారంటీలను మర్చిపోయిన కాంగ్రెస్
టేకుమట్ల: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను మర్చిపోయిందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అన్నారు. బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సట్ల రవిగౌడ్ ఆధ్వర్యంలో సోమవారం మండలకేంద్రంతో పాటు, మండలంలోని రామకిష్టాపూర్(టి)లో ఆరు గ్యారెంటీల బాకీ కార్డును ఇంటింటికీ అందించారు. అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక అబద్దాలను చెప్పి ప్రజలను మోసం చేసిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, వాటిని పట్టించుకోకుండా పాలన సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, బందెల స్నేహలత నరేష్, వైస్ ఎంపీపీ పోతనవేని ఐలయ్య, నల్లబెల్లి రవీందర్, ఆది రఘు, నిమ్మల స్వామి, వెంకటేశ్వర్‌రెడ్డి, పొన్నం చంద్రయ్య, ఆకునూరి తిరుపతి, అప్జల్, గువ్వాడి లక్ష్మన్, ఎలవేని భాగ్య పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి