
బీఆర్‌ఎస్ పాలనలో అన్నీ మోసాలే..
భూపాలపల్లి రూరల్: స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు గ్రామాలలో తిరుగుతూ కాంగ్రెస్ బాకీ కార్డు అంటూ దుష్ప్రచారం చేయడం చాలా సిగ్గుచేటని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనపై ధోకా కార్డును సోమవారం జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 23 శాతానికి కుదించి బీసీలను డోకా చేసింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమని ఆరోపించారు. 317 జీఓను తెచ్చి ఉద్యోగుల జీవితాలతో ఆడుకుని.. 20వ తేదీ వరకు జీతాలు ఇవ్వలేని స్థితికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీసుకువచ్చిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో ప్రజలు అండగా ఉండాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
ధోకా కార్డు విడుదల చేసిన ఎమ్మెల్యే గండ్ర