
బుధవారం శ్రీ 1 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
అటవీ గ్రామాలే..
తయారీ కేంద్రాలు..
న్యూస్‌రీల్
అటవీ గ్రామాల్లో జోరుగా గుడుంబా తయారీ
జోరుగా బెల్టుషాపుల్లోకి మద్యం..
దసరా పండుగ అంటేనే చుక్క, ముక్కకు పెట్టింది పేరు. అలాంటి దసరా పండుగ గాంధీ జయంతి రోజు వస్తుండటంతో మందుబాబులకు తిప్పలు వచ్చిపడింది. కానీ ఆ లోటును పూర్తి చేయడానికి బెల్టుషాపుల నిర్వాహకులు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. గాంధీ జయంతి సందర్భంగా గురువారం రోజు మద్యం దుకాణాలు బంద్ ఉండటం బెల్టుషాపు నిర్వాహకులకు కలిసి వచ్చింది. రెండు రోజుల ముందుగానే బెల్టుషాపుల నిర్వాహకులు స్థానికంగా ఉండే వైన్స్‌ల నుంచి పెద్ద మొత్తంలో మద్యం కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. సాధారణంగా బెల్టు దుకాణాల్లో బీర్లతో పాటు తక్కువ ధర కలిగిన మద్యం అందుబాటులో ఉంటుంది కానీ దసరా సందర్బంగా నిర్వాహకులు అన్ని రకాల మద్యాన్ని బెల్టుషాపుల్లో అందుబాటులో ఉంచేలా కొనుగోలు చేస్తున్నారు.
కాటారం: దసరా పండుగ నేపథ్యంలో జిల్లాలోని పలు గ్రామాల్లో గుడుంబా తయారీ విచ్చలవిడిగా సాగుతోంది. పండుగలు వస్తే చాలు గ్రామాల్లో గుడుంబా ఏరులై పారుతోంది. దసరా పండుగ కోసం పలు పల్లెల్లో గుడుంబా తయారీదారులు పెద్దఎత్తున గుడుంబా తయారుచేసి రవాణా, విక్రయానికి సిద్ధం చేశారు. పండుగకు పది రోజుల ముందు నుంచే గుడుంబా తయారీకి అవసరమయ్యే పటిక, బెల్లం ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొని నాటుసారా తయారీకి పూనుకున్నారు. తయారీకి ప్రత్యామ్నాయంగా యూరియా, చక్కర, ఇతర ముడిపదార్థాలు స్థానికంగా లభిస్తుండటంతో గుడుంబా తయారీ మరింత సులభమైంది. దీంతో లీటర్ల కొద్ది గుడుంబాను తయారుచేసి దసరా పండుగకు విక్రయాలు సాగిస్తున్నారు. ఓ పక్క ఎకై ్సజ్ అధికారులు తమ దాడులతో బెంబేలెత్తిస్తున్నప్పటికీ తయారీదారులు ఏ మాత్రం జంకకుండా తమ పని తాము కానిచ్చేస్తున్నారు.
దసరాకు భలే గిరాకీ..
పల్లెల్లో సాధారణ రోజుల్లోనే గుడుంబాకు, బెల్టుషాపుల్లో మద్యానికి గిరాకీ ఎక్కువగా ఉంటుంది. దసరా, సంక్రాంతి లాంటి పండుగలు వస్తే విక్రయాలు మరింత ఎక్కువగా సాగుతుంటాయి. దీని కి తోడు వైన్స్‌షాపులు బంద్ ఉంటుండటంతో బెల్టుషాపుల్లో మద్యం, గుడుంబా విక్రయాలు జోరుగా సాగే అవకాశాలు ఉన్నాయి. దసరా పండుగకు పల్లెలకు మద్యం, గుడుంబా కిక్కు నెలకొననుంది.
నిత్యం దాడులు..మారని తీరు..
గుడుంబా నియంత్రణపై పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించినప్పటికీ అంత మొత్తంలో ఫలితం దక్కడం లేదు. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు నిత్యం మూకుమ్మడిగా దాడులు నిర్వహించి వేలాది లీటర్ల బెల్లం పానకం, గుడుంబా ధ్వంసం చేసి కేసులు నమోదు చేస్తున్నప్పటికీ తయారీ మాత్రం ఆగడం లేదు. ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో రూట్ వాచ్‌లు, పెట్రోలింగ్ చేపడుతున్నప్పటికీ తయారీదారులు అధికారులు, సిబ్బంది కళ్లుగప్పి సరఫరా చేపడుతున్నారు. ఏడు నెలల కాలంలో జిల్లాలో గుడుంబా తయారీదారులు, విక్రయదారులపై వందలాది కేసులు నమోదయినప్పటికీ ఏ మాత్రం మార్పు రావడం లేదు.
జిల్లాలో గుడుంబా తయారీ, రవాణాను నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. దసరాకు గుడుంబా తయారీ ఎక్కువగా ఉంటుందని భావించి భూపాలపల్లి, కాటారం ఎకై ్సజ్ పరిధిలోని అధికారులు, సిబ్బంది, డిస్ట్రిక్ టాస్క్‌ఫోర్స్ టీంను అప్రమత్తం చేస్తూ గుడుంబా స్థావరాలపై నిత్యం దాడులు చేపడుతున్నాం. గాంధీ జయంతి రోజు మద్యం విక్రయాలు సాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
– శ్రీనివాస్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్
జిల్లాలో అధికంగా అటవీ గ్రామాల్లోనే గుడుంబా తయారీ జోరుగా కొనసాగుతోంది. పలు గ్రామాలు అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండటంతో తయారీదారులకు గుడుంబా తయారీ సులభతరం అవుతుంది. అటవీ ప్రాంతంలో తయారీదారులు రోజుకో అడ్డా మారుస్తూ పెద్దఎత్తున గుడుంబా తయారు చేసి రవాణాకు పాల్పడుతున్నారు. జిల్లాలోని కాటారం, మహాముత్తారం, మల్హర్, పలిమెల, మహదేవపూర్ మండలాలతో పాటు భూపాలపల్లి మండలంలోని పలు గ్రామాలు, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి, రేగొండ, మండలాల్లోని అధికంగా గుడుంబా తయారు చేస్తున్నారు. గతంలో ఇళ్ల పరిసర ప్రాంతాల్లో తయారు చేసేవారు, కానీ ఎకై ్సజ్ అధికారుల దాడులు అధికమవడంతో గ్రామాలకు సమీపంలోని అటవీ ప్రాంతాలు, పొలాలు, చేలు, వాగులు, వంకల సమీపంలో గుట్టుచప్పుడు కాకుండా తయారీకి పాల్పడుతున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా రాత్రి సమయంలో తయారీ సామగ్రిని తరలించి పగలు, రాత్రి తేడా లేకుండా పెద్ద ఎత్తున గుడుంబా తయారు చేస్తున్నారు. తయారు చేసిన గుడుంబాను మరో చోటుకు తరలించి నిల్వ చేస్తున్నారు. ఆర్డర్లపై గ్రామాల్లోని విక్రేతలకు ద్విచక్రవాహనాలు, ఆటోల్లో తీసుకెళ్లి డోర్ డెలివరీ చేస్తున్నట్లు సమాచారం.
బెల్టు దుకాణాలకు సైతం భారీగా మద్యం
గాంధీ జయంతి కావడంతో
ముందస్తుగా కొనుగోలు
పెద్ద ఎత్తున రవాణా, విక్రయాలు

బుధవారం శ్రీ 1 శ్రీ అక్టోబర్ శ్రీ 2025

బుధవారం శ్రీ 1 శ్రీ అక్టోబర్ శ్రీ 2025

బుధవారం శ్రీ 1 శ్రీ అక్టోబర్ శ్రీ 2025