
సింహ వాహనంపై ఊరేగింపు
కాళేశ్వరం: శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో శ్రీశుభానందదేవి (పార్వతి) అమ్మవారి ఉత్సవ విగ్రహన్ని ఆలయ ప్రాకారం మాడవీధుల గుండా సింహ వాహనంపై ఊరేగింపు సేవా కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మంగళవారం మంగళవాయిద్యాలతో ఊరేగింపు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదం అందజేశారు. గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఉపప్రధాన అర్చకుడు పనకంటి ఫణీంద్రశర్మ ఆధ్వర్యంలో పూజ తంతును నిర్వహించారు. సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్, జూనియర్ అసిస్టెంట్ రవి, సిబ్బంది దూది శ్రీనివాస్ పాల్గొన్నారు.

సింహ వాహనంపై ఊరేగింపు