
ఎంతవుతదో..
ఎన్నికల ఖర్చుపై ఆశావహుల టెన్షన్
భూపాలపల్లి అర్బన్: ఇన్నాళ్లు నోటిఫికేషన్.. రిజర్వేషన్ కోసం ఆతృతగా ఎదురుచూసిన అభ్యర్థులు ఇప్పుడు ఎన్నికల ఖర్చును ఊహించుకుంటూ బరిలో నిలవాలంటే భయపడుతున్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీచేయాలను ఆశావహులు ఖర్చు ఎంతవుతుందో అని మదనపడుతున్నారు. పోటీ చేద్దాం అనుకున్నా ఖర్చులు భయపెడుతున్నాయి.
రూ.20లక్షల వరకు..
స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఖరారుకావటంతో పాటు, సోమవారం నాడు ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలైంది. రిజర్వేషన్లు ఖరారుకావటంతో రిజర్వేషన్ కలిసివచ్చిన వారు ఉత్సాహంగా ఉండగా, మరికొందరు నిరాశకు గురయ్యారు. గతేడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలు ఉంటాయని తెలిసి, అప్పటి నుంచే ఆశావహ అభ్యర్థులు గ్రామాల్లో సందడి చేస్తున్నారు. వర్గాల వారీగా గ్రామస్తులను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో గ్రామాలవారీగా ఓటర్లు తక్కువగా ఉన్నా, గెలుపోటములను స్వల్ప ఓట్లే నిర్ణయిస్తాయి. కాబట్టి ప్రతి ఓటు విలువైనదే. దీంతో ఖర్చు కూడా గ్రామపంచాయతీల్లో రూ.15 లక్షల నుంచి రూ.20లక్షల వరకు అయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. మేజర్ గ్రామపంచాయతీల్లో ఇది ఇంకాస్త ఎక్కువయ్యే పరిస్థితి ఉంది. మండల హెడ్‌క్వార్టర్లుగా ఉన్న పంచాయతీల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయని పోటీచేసేందుకు ఆసక్తి చూపిస్తున్న అభ్యర్థులు అనుకుంటున్నారు.
దావత్‌లతో మొదలు
ఆశావహులకు ఖర్చుల మోత దసరా దావతులతో మొదలైంది. గ్రామంలో కొద్దిగా పట్టున్న చిన్న స్థాయి నాయకులకు, కులసంఘాల పెద్దలకు రోజు ఆశావహులు చాలా మంది దావత్‌లు మొదలు పెట్టారు. పనిలో పనిగా తాము పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు మనసులో మాట చెప్పి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. పనిలో పనిగా గ్రామాల్లోని యువ ఓటర్లకు పార్టీల పేరుతో ఓట్ల గాలాలు వేస్తున్నారు. దసరా పండుగకు గ్రామాలకు వచ్చిన వారితో మాటముచ్చట కలిపి మంచి చెడులపై తెలుసుకుంటున్నారు. మొదటి ఖర్చులే తడిసిపోతున్నాయని ఇక బరిలోకి దిగితే ఏమాత్రం ఖర్చు అవుతుందో అని అభ్యర్థులు డబ్బులు పోగేసే పనిలో ఉన్నారు.
అభ్యర్థులే భరించాలి..
జిల్లాలో అధికార పార్టీతో పాటు, ప్రతిపక్షాలది కూడా ఏమంత గొప్పగా లేదు. తమ పార్టీ మద్దతు ఉన్నా కూడా ఖర్చులను అభ్యర్థులే సొంతగా భరించాలని పార్టీల నాయకులు అంటున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాలేదు కాబట్టి గెలవాలంటే ఎంతో కొంత మీరే ఎన్నికల ఖర్చులు భరించాలని విపక్ష పార్టీల మద్దతు పొందే ఆశావహులకు పార్టీ నాయకులు సూచనప్రాయంగా తెలియజేస్తున్నారు. అధికార పార్టీలో కూడా ఇదే తీరు కనిపిస్తుంది. పెరిగిన ఖర్చులో పార్టీ ఇచ్చే ఫండ్ ఏమాత్రం సరిపోయేలా లేదు.
గ్రామాల్లో దసరా దావత్‌లు షురూ..
యువకులను ఆకర్షించే పనిలో
నాయకులు

ఎంతవుతదో..

ఎంతవుతదో..