
జూకల్‌లో సద్దుల బతుకమ్మ వేడుకలు
చిట్యాల: మండలంలోని జూకల్ గ్రామంలో మంగళవారం నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని బతుకమ్మ ఆడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక బతుకమ్మ పండుగ అన్నారు. ప్రజలు బతుకమ్మ, దసరా పండుగను సుఖసంతోషాలతో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ గుమ్మడి శ్రీదేవి, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముకిరాల మధువంశీకృష్ణ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి, నాయకులు రాంరెడ్డి, కిష్టయ్య, సంతోష్ , మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.