
పండుగ పూట.. రైతు తండ్లాట
యూరియా కోసం రైతులకు పండుగ పూట కూడా తండ్లాట తప్పడం లేదు. మహదేవపూర్ పీఏసీఎస్‌కు 660 బస్తాల యూరియా వచ్చిన విషయం తెలుసుకున్న మహదేవపూర్, బొమ్మాపూర్, బ్రాహ్మణపల్లి గ్రామాల మంగళవారం ఉదయం పీఏసీఎస్ ఎదుట బారులుదీరారు. భారీగా రావడంతో అధికారులు పోలీస్ పహారా నడుమ పంపిణీ చేశారు. గంటల తరబడి లైన్లలో వేచి ఉన్నప్పటికీ రైతులందరికీ యూరియా అందలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తచేస్తూ వెనుదిరిగారు. గ్రామాల్లోనే పంపిణీ చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటే ఇబ్బందులు ఉండవని వాపోయారు. – కాళేశ్వరం