
పొరపాటుకు తావివ్వొద్దు
పారా మీటర్లు
నమోదు చేయాలి..
పీఓలు, ఏపీఓలతో
సమావేశం
భూపాలపల్లి: చిన్న పొరపాటుకు కూడా తావులేకుండా స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో నోడ ల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికలు స జావుగా నిర్వహించుటలో అధికారుల విధులు చాలా కీలకమన్నారు. ఓటర్లను ప్రలోబాలకు గురిచేసే విధంగా నగదు, మద్యం, బహుమతుల పంపిణీపై పటిష్టమైన నిఘా ఉంచాలని చెప్పారు. చెక్‌పోస్టులలో వాహనాలను నిశిత పరిశీలన చేయాలని ఆ దేశించారు. మ్యాన్‌పవర్, బ్యాలెట్ బాక్సులు, ట్రా న్స్‌పోర్ట్ మేనేజ్‌మెంట్, శిక్షణా కార్యక్రమాల నిర్వహణ, మెటీరియల్ మేనేజ్‌మెంట్, ఎక్స్‌పెండిచర్ మానిటరింగ్, మీడియా కమ్యూనికేషన్, హెల్ప్‌లైన్ అండ్ కంప్లయింట్స్ రెడ్రెస్సల్, వెబ్‌కాస్టింగ్ తదితర విభాగాలపై నోడల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీపీఓ శ్రీలత, అన్ని విభాగాల నోడల్ అధికారులు పాల్గొన్నారు.
పార్టీలు సహకరించాలి..
ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన సందర్భంగా ఐడీఓసీ కార్యాలయపు కాన్ఫరెన్స్ హాల్‌లో రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎన్నికల్లో పాటించాల్సిన నిబంధనలపై పలు సూచనలు చేశారు.
స్ట్రాంగ్ రూం కోసం భవన పరిశీలన..
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో జిల్లా కేంద్రంలో స్ట్రాంగ్ ఏర్పాటు కోసం కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం స్థానిక గిరిజన ఆశ్రమ పాఠశాల భవనాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ వెంట కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్ ఉన్నారు.
యాస్పిరేషన్ పారా మీటర్లు పకడ్బందీగా నమోదు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. పలిమెల, మహాముత్తారం మండలాల యాస్పిరేషన్ పారామీటర్లు నమోదుపై మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, సీపీఓ బాబూరావు, డీఆర్‌డీఓ బాలకృష్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు వెన్నెముక లాంటివారని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై పీఓలు, ఏపీఓలకు మాస్టర్ ట్రెయినర్లతో ఐడీఓసీ కార్యాలయపు సమావేశపు హాల్‌లో కలెక్టర్ రాహుల్ శర్మ సమావేశం నిర్వహించి మాట్లాడారు. పోలింగ్ కేంద్రాల వద్ద శాంతి భద్రతల నిర్వహణ, ఓటర్ల సౌకర్యాలు, బ్యాలెట్ బాక్సులు, ఓటరు స్లిప్పులు, అభ్యర్థుల గుర్తులు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు తదితర అంశాలను తెలియజేశారు.
ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులే కీలకం
కలెక్టర్ రాహుల్ శర్మ