
కలుషిత నీరు తాగేదెలా?
కాటారం: కాటారం మండలం రేగులగూడెం గ్రామపంచాయితీ పరిధిలోని సమీప కాలనీలో గ్రామపంచాయతీ ఏర్పాటు చేసిన నల్లాల ద్వారా కలుషిత నీరు సరఫరా అవుతుంది. వారం రోజులుగా పూర్తిగా కలుషితమైన నీరు సరఫరా అవుతుందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తంచేశారు. కలుషిత నీటితో కనీసం కాలకృత్యాలు సైతం తీర్చుకునే పరిస్థితి లేదని.. ఒకవేళ తాగితే రోగాల పాలు కావాల్సి వస్తుందని వాపోతున్నారు. గ్రామపంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని అన్నారు. అధికారులు స్పందించి స్వచ్ఛమైన నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరారు.