
యూరియా కొరత సృష్టిస్తే చర్యలు
చిట్యాల: ఎరువుల దుకాణాలలో యూరియా కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు. బుధవారం మండలకేంద్రంలోని సహకార సంఘం, తహసీల్దార్ కార్యాలయం, పలు ఎరువుల దుకాణాలు, పశువుల ఆస్పత్రి, ఒడితల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎవరూ ఆందోళన చెందవద్దని, రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. ఎరువులు షాపులలో అధిక ధరలకు విక్రయిస్తే లైసె న్స్ రద్దు చేయడంతో పాటు పోలీస్ కేసులు నమో దు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. యూరియా కావాలంటే ఆర్గానిక్ ఎరువులు కొనాలనే ఆంక్షలు పెడితే కేసు నమోదు చేయాలని అన్నారు. ఇలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోకపోతే అధికారులను సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. ప్రజలు జ్వరాల బారిన పడకుండా గ్రామాలలో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్, డీసీఓ వాలియా నాయక్, పశుసంవర్ధక శాఖ డీడీ డాక్టర్ కుమారస్వామి, ఆర్డీఓ రవి, వ్యవసాయశాఖ ఏడీఏ రమేష్, ఏఓ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, పీఏసీఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్‌రెడ్డి, తహసీల్దార్ షేక్ ఇమామ్‌బాబా, వ్యవసాయశాఖ మండల అధికారి శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌ఐ రాజేందర్ పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ