
హెపటైటిస్‌ను విచ్ఛిన్నం చేయాలి
భూపాలపల్లి అర్బన్: కాలేయంకు సంబంధించిన హెపటైటిస్ వ్యాధిని ముందస్తుగా గుర్తించి విచ్ఛిన్నం చేయాలని జిల్లా ఇన్‌చార్జ్ వైద్యారోగ్యశాఖ శాఖ అధికారి డాక్టర్ శ్రీదేవి సూచించారు. ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం జిల్లాకేంద్రంలోని పీహెచ్‌సీ ఆవరణలో ఏర్పాటుచేసిన సమావేశానికి డాక్టర్ శ్రీదేవి హాజరై మాట్లాడారు. హెపటైటిస్ అనేది కాలేయానికి సంబంధించి ఉండే వాపు అన్నారు. ఇది వివిధ రకాల వైరస్‌ల వలన ఏర్పడుతుందన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పరీక్షలు చేయడం, వ్యాక్సినేషన్, చికిత్స కోసం ప్రోత్సహించాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, సురక్షిత నీరు, ఆహారం తీసుకోవడం, హెపటైటిస్ వ్యాక్సిన్ వేయించుకోవడం, రక్తమార్పిడి ముందు పరీక్ష చేయించుకోవాలని సూచించారు. దీంతో దీనిని నివారించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారిణి డాక్టర్ రోహిణి, సీహెచ్‌ఓ సదానందం, సిబ్బంది, ఆశా పాల్గొన్నారు.
జిల్లా ఇన్‌చార్జ్ వైద్యారోగ్యశాఖ అధికారి
డాక్టర్ శ్రీదేవి