లింగాలఘణపురం: మండల కేంద్రంలో గతేడాది ఉపాధి హామీ పనులపై జరిగిన మండల స్థాయి సోషల్ ఆడిట్‌లో రూ.85,688 రికవరీకి ఏపీడీ నాగశేషాద్రి ఆదేశించారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సోషల్ ఆడిట్ ఓపెన్ ఫోరంలో కూలీల వేతనాలకు రూ.23,10,440 కాగా మెటీరియల్ పనులు రూ.1,02,75,597లకు గాను సోషల్ ఆడిట్ నిర్వహించారు. ఇందులో ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, పీఆర్‌ఏఈలతో ఏపీఓలకు సంబంధించి రూ.85,688ల రికవరీకి ఆదేశించారు. గ్రామ స్థాయి, మండల స్థాయి సోషల్ ఆడిట్‌లో పంచాయ తీ కార్యదర్శులు తప్పనిసరిగా హాజరు కావాలని, అదేవిధంగా టీఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు తప్పిదాలను సరిచేసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ మేనేజర్ తిరుపతి, ఎంపీడీఓ శివశంకర్‌రెడ్డి, ఎంపీఓ సుమన్, అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ సంధ్య, జూనియర్ క్వాలిటీ కంట్రల్ ఆఫీసర్ రాజవర్థన్, ఏపీఓ సతీష్, ఆడిట్ సిబ్బంది పాల్గొన్నారు.


