ఎస్‌ఐఆర్‌ను సద్వినియోగం చేసుకోండి | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐఆర్‌ను సద్వినియోగం చేసుకోండి

Jul 29 2026 1:34 AM | Updated on Jul 29 2026 1:34 AM

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌

కడకంచి బాలమణిశ్రీనివాస్‌

జనగామ: ఓటర్ల జాబితాను మరింత పారదర్శకంగా, కచ్చితంగా నవీకరించేందుకు చేపట్టిన ఎస్‌ఐఆర్‌ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌)ను ప్రతీ ఓటరు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కడకంటి బాలమణిశ్రీనివాస్‌ కోరారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా చూసుకోవాలని సూచించారు. పేరు లేకపోయినా, వివరాల్లో మార్పులు అవసరమైనా ఎన్నికల నిబంధనల ప్రకారం సంబంధిత దరఖాస్తు ఫారాలను సక్రమంగా నింపి, అవసరమైన ధ్రువపత్రాలు జత చేసి, తమ పరిధిలోని బీఎల్‌ఓకు నిర్ణీత గడువులోగా అందజేయాలని తెలిపారు. పూర్తి వివరాల కోసం మున్సిపల్‌ కేంద్రంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించి అవసరమైన సమాచారాన్ని పొందవచ్చని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement