జనగామ: జనగామ ఇంగ్లిష్ మిషన్ (జేఈఎం) ఆధ్వర్యంలో మహిళల కోసం ఉచి తంగా 30 రోజుల స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మిషన్ ప్రతినిధి కర్రె మల్లేశం తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. పెరియార్ ఎడ్యుకేషనల్ సొసైటీ సహకారంతో చేపడుతున్న ఈ కార్యక్రమం ఆగస్టు 1 నుంచి 30వ తేదీ వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి 3.30 గంటల వరకు పట్టణంలోని కురుమవాడ కురుమ సంఘం భవనంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. శిక్షణలో గృహిణులు, ఉద్యోగి నులు, యువతులు, తమ పిల్లలకు ఇంగ్లిష్ నేర్పించాలని, ఆసక్తి ఉన్న తల్లులకు రోజువారీ సంభాషణలు, సరైన ఉచ్ఛారణ, పదజాలం, ఆత్మవిశ్వాసంతో ఇంగ్లిష్ మాట్లాడే పద్ధతులు, పిల్లలతో ఆంగ్లంలో సంభాషించే విధానం, ఆధునిక సాంకేతికతలు, కృత్రిమ మేధస్సు వినియోగానికి అవసరమైన ప్రాథమిక ఇంగ్లిష్ నైపుణ్యాలను బోధిస్తామని తెలిపారు. ఆసక్తి గల మహిళలు ముందస్తుగా పేర్లు నమోదు చేసుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. నమోదు కోసం బాల్దె గణేష్ (9032808023), సంపత్ (9959591641), (9642819000) నంబర్లను సంప్రదించాలని సూచించారు.
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌కు ఎంపిక
లింగాలఘణపురం: మండలంలోని వనపర్తి పీవీఆర్ పాఠశాలకు చెందిన 4వ తరగతి విద్యార్థిని దండిగ అక్షయ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ లాంగ్‌జంప్ పోటీలకు ఎంపికై నట్లు కరెస్పాండెంట్ వెంకట్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌లో అక్షయ లాంగ్‌జంప్‌లో ద్వితీయ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు వివరించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ వెంకట్‌రెడ్డి, ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందించారు.
చిన్నపెండ్యాల విద్యార్థి..
చిల్పూరు: మండలంలోని చిన్నపెండ్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి ఆసర్ జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఆసర్‌ను హెచ్‌ఎం సంపత్‌కుమార్, వ్యాయామ ఉపాధ్యాయుడు రవీంద్రప్రసాద్, సర్పంచ్ తిరుపతమ్మ, ఉప సర్పంచ్ సంతోష్ తదితరులు అభినందించారు.
ఏసీరెడ్డి స్ఫూర్తితో ప్రజా
ఉద్యమాలకు సిద్ధం కావాలి
● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు అబ్బాస్
జనగామ రూరల్ : తెలంగాణ రైతాంగ సాయుధపోరాటంలో ముందుండి నడిపించిన మాజీ ఎమ్మెల్యే ఏసీరెడ్డి నర్సింహారెడ్డి స్ఫూర్తితో ప్ర జా ఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ అబ్బాస్ పిలుపునిచ్చారు. ఏసీ రెడ్డి వర్ధంతి సందర్భంగా మంగళవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పట్టణ కేందంలోని జూబ్లీ ఫంక్షన్ హాల్ వరకు పార్టీ కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాపర్తి రాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అబ్బాస్ మాట్లాడారు.. ఏసీ రెడ్డి నర్సింహారెడ్డి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రత్యేక్షంగా పాల్గొని నైజాం సర్కార్‌కు, దొరలకు ఎదురొడ్డి పోరాటం చేసిన మ హోన్నత వ్యక్త అని ఆయన సేవలను కొనియాడారు. జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి, ఇర్రి అహల్య సాంబరాజు యాదగిరి, రాపర్తి సోమ య్య, సింగారపు రమేశ్, బొట్ల శేఖర్, బూడిద గోపి, జోగు ప్రకాశ్, సుంచు విజేందర్, పి.ఉపేందర్, మునిగెల రమేశ్, చిట్యాల సోమన్న, ఎండీ అజారుద్దీన్ పాల్గొన్నారు.
ముద్రా, జ్వాలామాలినీ క్రమంలో భద్రకాళి
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో శాకంబరీ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం అమ్మవారికి ముద్రా, జ్వాలామాలినీ క్రమాల్లో పూజలు నిర్వహించారు.


