2వ తేదీన పరీక్ష | - | Sakshi
Sakshi News home page

2వ తేదీన పరీక్ష

Jul 29 2026 1:28 AM | Updated on Jul 29 2026 1:28 AM

2వ తేదీన పరీక్ష అంతా పారదర్శకం..

ఔట్‌సోర్సింగ్‌ రాత పరీక్షలను పర్యవేక్షిస్తున్న కలెక్టర్‌(ఫైల్‌)

వచ్చే నెల 2వ తేదీన విద్యాశాఖలో మరో ఆరు ఔట్‌ సోర్సింగ్‌ పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్‌, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలకు ఇద్దరు మహిళా ఏఎన్‌ఎంలు, ముగ్గురు మహిళా అకౌంటెంట్‌ పోస్టుల కోసం కలెక్టరేట్‌లో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరీక్ష అనంత రం అదే రోజు ఫలితాలు ప్రకటించి, స్వల్ప వ్యవధిలోనే ఎంపికై న వారికి నియామక ఉత్తర్వులు అందజేయనున్నారు. ఔట్‌ సోర్సింగ్‌ నియామకాల్లో పైరవీలు, డబ్బు ప్రభా వానికి తావులేకుండా కేవలం అర్హత, ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు కల్పిస్తున్న ఈ విధానం జిల్లాలో నిరుద్యోగ యువతలో విశ్వాసాన్ని పెంచుతోంది. పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ యంత్రాంగం అమలు చేస్తున్న ఈ విధానం ఇతర జిల్లాలకు కూడా ఆదర్శంగా నిలుస్తోంది.

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల నియామకంలో పూర్తిస్థాయి పారదర్శకత పాటిస్తున్నాం. కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా మార్గదర్శకత్వంలో నోటిఫికేషన్‌, రాత పరీక్ష, మెరిట్‌ జాబితా ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాం. ఎలాంటి పైరవీలు, సిఫార్సులు లేదా ఇతర జోక్యాలకు అవకాశం లేదు. ఆగస్టు 2న విద్యాశాఖలోని ఆరు పోస్టులకు కూడా ఇదే విధానంలో పరీక్ష నిర్వహించి, అర్హులైన వారిని మాత్రమే నియమిస్తాం. ఉద్యోగులకు ప్రతీ నెల ఒకటో తేదీన వేతనాలు పడేలా కలెక్టర్‌ చర్యలు తీసుకుంటున్నారు. ఆలస్యం చేస్తే చట్టపరమైన చర్యలకు సైతం ఆదేశాలు జారీ చేశారు.

– ర్యాకం కుమారస్వామి,

జిల్లా ఎంప్లాయిమెంట్‌ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement