ఉపసర్పంచ్‌లకు గౌరవ వేతనం ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

ఉపసర్పంచ్‌లకు గౌరవ వేతనం ఇవ్వాలి

Jul 29 2026 1:28 AM | Updated on Jul 29 2026 1:28 AM

జనగామ రూరల్‌: ఉపసర్పంచ్‌లకు 5 వేల గౌరవ వేతనంతో పాటు అన్ని కార్యక్రమాల్లో తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ఉపసర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడు పండుగ హరీష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఉప సర్పంచుల హక్కుల సాధన కోసం రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం పిలుపు మేరకు మంగళవారం ‘చలో కలెక్టరేట్‌’ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉప సర్పంచులు కలెక్టరేట్‌ వద్ద ఆందోళన నిర్వహించారు. అనంతరం ఏఓ రవికిరణ్‌కు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ తీర్మానాలపై సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌కు కూడా సంతకం చేసే అధికారాన్ని కల్పించాలన్నారు. గ్రామపంచాయతీల్లో స్టాండింగ్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ గా ఉప సర్పంచ్‌ను ప్రకటించాలన్నారు. ఉప సర్పంచుల హక్కులు పూర్తిస్థాయిలో సాధించే వరకు ఉద్యమాన్ని నిరంతరం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కొర్ర శంకర్‌ నాయక్‌, అఖిల వెంకటేష్‌, ప్రధాన కార్యదర్శులు కృష్ణారెడ్డి, నాగపురి కిషన్‌గౌడ్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పిడుగు మహేష్‌, జిల్లా కన్వీనర్‌ కుంటి రాజు, ఉప సర్పంచులు సంపత్‌ రెడ్డి, కిరణ్‌ స్వామి, బక్క సరిత, మల్లేష్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

హక్కుల సాధనకు ఉద్యమిస్తాం

కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement