హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో కొనసాగుతున్న శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా సోమవారం త్రయోదశి తిథి అనుసరించి అమ్మవారికి మాత్రా, సర్వమంగళ క్రమాల్లో పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు నిత్యాహ్నిక పూజలు చతుస్థానార్చనలు జరిపారు. స్నపనమూర్తిని కాళీకల్పకం ప్రకారం.. మాత్రా అమ్మవారుగా బోగభేరాన్ని షోడశీక్రమంలో సర్వమంగళగా అలంకరించి చతుఃస్థానార్చన పూజలు, నీరాజన మంత్రపుష్పాలు, తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు. రేపు బుధవారం అమ్మవారిని మహాశాకంబరీగా అలంకరించనున్నారు. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు ఏర్పా టు చేశారు. భద్రతా, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లను మల్వాడ సీఐ కరుణాకర్, పోలీస్ సిబ్బందితో కలిసి ఆలయ ఈఓ రామల సునీత పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్ సీనియర్ ఐఏఎస్ అధికారి సునీత దంపతులు, హనుమకొండ ఆర్డీఓ వెంకన్న, టూరిజం అధికారి శివాజీ, తహసీల్దార్ రవీందర్, శ్రీనివాస మంగాపురం చిత్రం హీరో గట్టమనేని జైకృష్ణ, దర్శకుడు అజయ్ భూపతి, చిత్రం యూనిట్ అమ్మవారికి దర్శించుకున్నారు.
మాత్రాక్రమం, సర్వమంగళ క్రమంలో అమ్మవారు


