ప్రీ–ప్రైమరీ నియామకాల జాబితా విడుదల | - | Sakshi
Sakshi News home page

ప్రీ–ప్రైమరీ నియామకాల జాబితా విడుదల

Jul 27 2026 1:24 AM | Updated on Jul 27 2026 1:24 AM

జనగామ: జిల్లాలో ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రీ–ప్రైమరీ విభాగాల ప్రారంభం, బలోపేతం కోసం జిల్లా విద్యాశాఖ తాత్కాలిక నియామక ప్రక్రి య చేపట్టింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి, సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు అధికారి, కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఉత్తర్వులు జారీ చేశారు.

36 మంది ఇన్‌స్ట్రక్టర్లు, 37 మంది ఆయాలు..

జిల్లాలో మొత్తం 39 ప్రీ–ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్లు, 39 మంది ఆయాలను ఎంపిక చేయాల్సి ఉండగా, ప్రస్తుతం 36 మంది ఇన్‌స్ట్రక్టర్లు, 37 మంది ఆయాల తాత్కాలిక ఎంపిక జాబితాను మాత్రమే విడుదల చేశారు. దీంతో 5 పోస్టులు ఖాళీగా ఉంచారు. వీటిలో 3 ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టులు, 2 ఆయాల పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులు ఖాళీగా ఉండడానికి కారణం రెండు కేటగిరీలకు చెందిన 12 మంది అభ్యర్థులకు ఒకే మార్కులు రావడం, దీంతో తుది ఎంపికలో స్పష్టత కోసం ఆ అభ్యర్థులకు ఈ నెల 28వ తేదీన మరోసారి పరీక్ష నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ నిర్ణయించింది. ఆ పరీక్షలో ప్రతిభ ఆధారంగా మిగిలిన 3 ఇన్‌స్ట్రక్టర్లు, 2 ఆయాల పోస్టులను భర్తీ చేయనున్నారు.

మండలాల వారీగా

ప్రస్తుతం ఎంపికైన అభ్యర్థులు మండలాల పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక పాఠశాలల్లో విధులు నిర్వహించనున్నారు. ఎంపికై న ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాలు తాత్కాలిక ప్రాతిపదికన పనిచేయనుండగా, వారికి 2026–27 విద్యాసంవత్సరంలో గరిష్టంగా 10 నెలల పాటు గౌరవ వేత నం చెల్లించనున్నారు. సంబంధిత మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు ఎంపికై న వారిని వెంటనే విధుల్లో చేర్చి అమలు నివేదికను సమగ్ర శిక్ష కార్యాలయానికి పంపాలని డీఈఓ ఆదేశించారు. 28వ తేదీన నిర్వహించే పరీక్ష అనంతరం మిగిలిన ఐదు పోస్టులకు కూడా తుది ఎంపిక జాబితాను ప్రకటించనున్నట్లు విద్యాశాఖ ఏడీ శ్రీనివాస్‌ తెలిపారు.

36 మంది ఇన్‌స్ట్రక్టర్లు, 37 మంది ఆయాల ఎంపిక

ఒకే మార్కులతో నిలిచిన 12 మంది అభ్యర్థులు

28వ తేదీన 5 పోస్టులకు మళ్లీ పరీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement