జనగామ: ఆషాఢ మాసం తొలి ఏకాదశి పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో కురుమ కులస్తులు బీరప్ప, కామరాజు దేవతామూర్తులకు ఘనంగా శనివారం బోనాలు సమర్పించారు. వేలాదిగా కురుమలు హాజరై ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని చాటిచెప్పారు. కురుమ కులపెద్దలు పట్టు వస్త్రాలు ధరించి సంప్రదాయ పద్ధతిలో ముందుగా ఊరేగింపును ప్రారంభించారు. మహిళలు తలపై బోనాలు మోసుకుంటూ భారీ ర్యాలీగా బొడ్రాయి వద్దకు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శోభాయాత్రగా బీరప్ప ఆలయానికి చేరుకుని దేవతామూర్తులకు బోనాలు సమర్పించారు. అమ్మవార్ల వేషధారణలు, ఒగ్గుడోలు కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.


