మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి | - | Sakshi
Sakshi News home page

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి

Jul 26 2026 2:08 AM | Updated on Jul 26 2026 2:08 AM

జనగామ: మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి యువత తమ నైపుణ్యాలను సమాజాభివృద్ధికి ఉపయోగించాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్‌, నార్కోటిక్‌ విభాగం సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌, పిలుపునిచ్చారు. శనివారం మాదకద్రవ్యాలను నిర్మూలించి వికసిత్‌ భారత్‌ నిర్మాణంలో యువత పాత్రను పెంచేందుకు యువజన కార్యక్రమాలు, క్రీడల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో యశ్వంతపూర్‌లోని క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్‌ కళాశాలలో నషా ముక్త్‌ ఫర్‌ వికసిత్‌ భారత్‌లో భాగంగా మైభారత్‌ జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ విద్యార్థులతో మాదకద్రవ్య వ్యతిరేక ప్రమాణం చేయించారు. మాదకద్రవ్యాల నిర్మూలన అంశంపై సీజేఐటీ విద్యార్థిని అలేఖ్య చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఆమెను డీసీపీ బంగారు పతకంతో సత్కరించి ధైర్యశాలి అని అభినందించారు. ఇందులో డిగ్రీ, ఫార్మసీ, ఇంజనీరింగ్‌ కళాశాలల విద్యార్థులు హాజ రయ్యారు. కార్యక్రమ నిర్వాహకుడు నవీన్‌, కళా శాల ప్రిన్సిపాల్‌ ఎస్‌.చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సీజేఐటీ సదస్సులో

డీసీపీ రాజమహేంద్ర నాయక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement