సూచనలు గమనించాలి..
సూచనలు గమనించాలి..
జనగామ: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వర్షాభావం నెలకొందని, జిల్లా కూడా దుర్భర పరిస్థి తులను ఎదుర్కొంటోందని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, జనగామ కో ఆర్డినేటర్ డాక్టర్ వి.రమ్య తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ ఎల్‌నినో నేపథ్యంలో జిల్లా రైతులకు పలు సూచనలు, సలహాలు అందించారు. రైతులు ప్రస్తుత పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండి శాసీ్త్రయ యాజమాన్య పద్ధతులు పాటించాలని ఆమె సూచించారు. జూన్ 1 నుంచి జూలై 22 వరకు జిల్లాలో సాధారణంగా 261.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 143.8 మిల్లీమీటర్లు మాత్రమే నమోదై 44.9 శాతం వర్షపాతం లోటు ఏ ర్పడిందన్నారు. జిల్లాలో మొత్తం 3,59, 281 ఎకరాల సాధారణ సాగు విస్తీర్ణానికి గాను ఇప్పటివరకు 2,41,193 ఎకరాల్లో (67.13 శాతం) మాత్రమే సాగు పూర్తయిందన్నారు. ప్రధాన పంటల్లో పత్తి 1,38,325 ఎకరాల్లో సాగై సాధారణ విస్తీర్ణాన్ని అధిగమించి 100.86 శాతం నమోదు చేయగా, వరి 95,653 ఎకరాల్లో (45.81 శాతం), మొక్కజొన్న 25.37 శాతం, పెసర 2,305 ఎకరాల్లో (33.61శాతం), మినుము 562 ఎకరాల్లో (67.22 శాతం) సాగైనట్లు వెల్లడించారు.
యాజమాన్య పద్ధతులను అనుసరించాలి
పొలాల్లో అంతరకృషి చేసి కలుపు మొక్కలను పూర్తిగా తొలగించాలని, రిడ్జ్ అండ్ ఫరో లేదా బోదెలు, చాళ్ల పద్ధతి ద్వారా వర్షపు నీటిని పొలంలోనే నిల్వ చేసి నేల తేమను కాపాడాలని సూచించారు. నత్రజని ఎరువులు (యూరియా) నేలలో తగిన తేమ ఉన్నప్పుడే వేయాలని, అందుబాటులో ఉన్న నీటిని రక్షణాత్మక సాగు నీటికి మాత్రమే వినియోగించాలని పేర్కొన్నారు. రైతులు తమ పొలాలను తరచూ పరిశీ లి స్తూ చీడపీడలను ప్రారంభ దశలోనే గుర్తించాలని, ఆర్థిక నష్టం స్థాయికి చేరినప్పుడు మాత్రమే నిపుణుల సలహాతో నివారణ చర్యలు చేపట్టాలన్నారు.
పత్తి పంట..
పొడి వాతావరణం కొనసాగితే రసం పీల్చే పురుగుల ఉధృతి పెరిగే అవకాశముందని శాస్త్రవేత్త రమ్య పేర్కొన్నారు. ప్రారంభ దశలో వేపనూనె 1,500 పీపీఎం ఎకరానికి 1 లీటరు పిచికారీ చేయాలని సూచించారు. ఉధృతి తీవ్రంగా ఉంటే లీటరు నీటికి 2 మిల్లీ లీటర్లు ఫిప్రోనిల్ లేదా 0.3 గ్రాములు ఫ్లోనికామిడ్ పిచికారీ చేయాలని తెలిపారు. రసాయన రహిత నియంత్రణ కోసం ఎకరానికి 10–15 పసుపు లేదా నీలం రంగు స్టిక్కీ ట్రాప్స్, అలాగే 1–2 సోలార్ లైట్ ట్రాప్స్ ఏర్పాటు చేయాలని సూచించారు.
వరి పంట..
వరి పంటలో కాండం తొలిచే పురుగు ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున నివారణకు కార్బోఫ్యూరాన్ 3ఎ గుళికలు ఎకరానికి 10 కిలోలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4ఎ గుళికలు ఎకరానికి 8 కిలోలు సమానంగా వెదజల్లి, అనంతరం పొలంలో స్వల్పంగా నీరు నిల్వ ఉండేలా చూడాలని సూచించారు. ఆలస్యంగా నాటిన వరి పొలాల్లో ఈ పురుగు ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తత పాటించాలని హెచ్చరించారు.
మొక్కజొన్న..
మొక్కజొన్నలో కత్తెర పురుగు ఉధృతి తీవ్రంగా ఉంటే లీటరు నీటికి 0.3 గ్రాములు ఎమామెక్టిన్ బెంజోయేట్ లేదా 0.4 మిల్లీ లీటర్లు క్లోరాంట్రాని లిప్రోల్ పిచికారీ చేయాలని సూచించారు.
వర్షాలు మరింత ఆలస్యమైతే నీటి అవసరం తక్కువగా ఉండే పెసర, మినుము, నువ్వులు, జొన్న, సజ్జలు వంటి ప్రత్యామ్నాయ పంటలను ఎంపిక చేసుకోవాలని ఆమె సూచించారు. మార్కెట్ సౌకర్యం, నాటే మొక్కల లభ్యత ఉన్న ప్రాంతాల్లో లెమన్ గ్రాస్ వంటి సుగంధ పంటలను కూడా ప్రత్యామ్నాయంగా సాగు చేయవచ్చని తెలిపారు. వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నందున రైతులు ప్రతిరోజూ వాతావరణ సూచనలను గమనిస్తూ, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసే తాజా వ్యవసాయ సలహాలను తప్పనిసరిగా అనుసరించాలని సూచించారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో నేల తేమ సంరక్షణ, పంట రక్షణ, శాసీ్త్రయ యాజమాన్య చర్యలే దిగుబడిని కాపాడే ప్రధాన మార్గాలని పేర్కొన్నారు.

ఎల్‌నినో పరిస్థితులపై రైతుల అప్రమత్తత అవసరం
తక్కువ నీరు అవసరముండే పంటలే వేయాలి
తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రమ్య