కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ ఇంటర్ విద్య
కార్పొరేట్‌కు దీటుగా..
ఇంటర్
పాఠాలు..
జనగామ రూరల్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యాబోధనలోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బోర్డులపై పాఠాలు బోధించే పద్ధతికి స్వస్తి పలికారు. పాఠశాలల్లో అమలవుతున్న డిజిటల్ తరగతుల తరహాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనూ డిజి టల్ తెరలపై అధ్యాపకులు పాఠాలు బోధించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
28 డిజిటల్ స్క్రీన్లు..
ఇంటర్ విద్య కమిషనర్ ఎస్.కృష్ణఆదిత్య వినూత్న ఆలోచనలతో కార్పొరేట్ కళాశాలల్లో కూడా లేని విధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పేద విద్యార్థుకుల ఉత్తమ భోధన అందించాలనే ఉద్దేశ్యంతో ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ ఇంటరాక్టివ్ ప్యానెల్స్ (ఐడీపీ)ను జిల్లాలోని 7 కళాశాలలకు నాలుగు చొప్పున మొత్తం 28 అందించారు. డిజిటల్ స్క్రీన్ల ద్వారా పాఠ్యాంశాలను వీడియోలు, యానిమేషన్లు, గ్రాఫిక్స్ రూపంలో చూపించడంతో విద్యార్థులకు పాఠాలు సులభంగా అర్థమవుతాయి. గణితం, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం వంటి క్లిష్టమైన సబ్జెక్టుల్లోని పాఠ్యాంశాలను విజువల్ పద్ధతిలో నేర్చుకునే అవకాశం ఏర్పడుతుంది. వీటిని ఉపయోగించుకోవడానికి విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో ప్రవేశాలు పొందాలని ఈనెల 31 వర కు అవకాశం ఉందని డీఐఈఓ జితేందర్‌రెడ్డి తెలి పారు. అలాగే రానున్న రోజుల్లో మధ్యాహ్న భోజనం కూడా అమలు కానుండడంతో విద్యార్థులకు మంచి అవకాశమే.
ఆన్‌లైన్ శిక్షణకు కీలకం..
ఈ ప్యానెల్స్ ద్వారా బోధనతోపాటు వివిధ పోటీపరీక్షలకు సంబంధించిన శిక్షణను సద్వినియోగం చేసుకో వచ్చు. విద్యార్థులను ఐఐటీ, నీట్‌లాంటి ప్రవేశ పరీక్షలకు సిద్ధం చేసేందుకు ఆన్‌లైన్ శిక్షణను ఉపయోగించుకునే వీలుంది. ఖాన్ అకాడమీ, ఫిజిక్స్‌వాలా వంటి శిక్షణ సంస్థల నుంచి విద్యార్థులు శిక్షణ పొందేందుకు ఎంతో కీలకంగా పనిచేయనున్నాయి.
విద్యుత్, ఇంటర్నెట్..
ఒక్కో కళాశాలకు రూ.6లక్షలకు పైగా వెచ్చిస్తున్నారు. అధ్యాపకుడి కేంద్రంగా ఇంటరాక్టివ్ బోధన కోసం రెండు ఐఎఫ్‌బీ స్క్రీన్లు, విద్యార్థుల విజువల్ లెర్నింగ్ ఉపయోగపడేలా మరో రెండు ఐడీపీ మొత్తం నాలుగు స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఇందుకోసం అవసరమైన విద్యుత్, ఇంటర్నెట్, సౌండ్ సిస్టమ్ వంటి వసతులను అప్‌గ్రేడ్ చేయనున్నారు.
బోధనలో సౌలభ్యం..
ఎస్‌ఈడీ వినియోగంతో అధ్యాపకులకు బోధన మరింత సులభంగా మారనుంది. డిజిటల్ కంటెంట్, ప్రజెంటేషన్లు, ఆన్‌లైన్ విద్యావనరులను నేరుగా తరగతిగదిలో ఉపయోగించవచ్చు. ఒకే పాఠాన్ని అన్ని తరగతుల విద్యార్థులకు ఒకేలా బోధించే అవకాశం ఉండటం, నాణ్యత పెరగడం వంటి ప్రయోజనాలు కలుగుతాయి. గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులు సైతం కార్పొరేట్ స్థాయి బోధన అందడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడనుంది.
ఇప్పటికే ఎల్‌ఈడీలు, పరికరాలు అమరిక
రానున్న రోజుల్లో మధ్యాహ్న భోజనం అమలు
ఈనెల 31 వరకు అడ్మిషన్లకు అవకాశం
ప్రభుత్వ కళాశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతున్నారు. అందులో భాగంగా ప్రభుత్వం మౌలిక వసతులతో పాటు డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. పోటీ పరీక్షల్లో సైతం విజయాలు సాధించేందుకు అవకాశం ఉంది. ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తమ అధ్యాపకులు ఉన్నారు.. విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలి.


