ఆలయాలకు
జనగామ: తొలి ఏకాదశి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వైష్ణవ, శైవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రత్యేక దర్శనాలు, అభిషేకాలు, అర్చనలు, అలంకరణలు నిర్వహించారు. పట్టణంలోని బాణాపురం శ్రీ వెంకటేశ్వరస్వామి, గుండ్లగడ్డ శ్రీ ఉమామహేశ్వరస్వామి, శ్రీ సంతోషిమాత, ఉప్పలమ్మ సహిత శ్రీ ఆంజనేయ స్వామి, గణేష్ స్ట్రీట్ ఆంజనేయస్వామి, మహంకాళమ్మ, పోచమ్మ, బతుకమ్మ కుంట శ్రీ విజయ దుర్గామాత, సాయిబాబా, శ్రీ కన్యకాపరమేశ్వరి, శ్రీ చెన్నకేశస్వామి, మూలబావి శ్రీ హనుమత్ రామచంద్రస్వామి, హనుమాన్ ఆల యాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణలు నిర్వహించారు. గుండ్లగడ్డ ఉమామహేశ్వరస్వామి ఆలయం, శ్రీ సంతోషిమాత ఆలయాల్లో ఘటాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. డీసీపీ రాజమహేంద్ర నాయక్ పాల్గొని ఘటాభిషేకం నిర్వహించారు. మంచి వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ అన్ని ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.


