స్టేషన్‌ఘన్‌పూర్: విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు వినియోగదారులకు వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని టీజీ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్(ఆపరేషన్స్) టి.మధుసూదన్ అన్నారు. జనగామ సర్కిల్‌లోని స్టేషన్‌ఘన్‌పూర్ డివిజన్‌లో ఘన్‌పూర్ సెక్షన్, సబ్ డివిజన్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మొబైల్ ట్రాలీ డీటీఆర్ వాహనాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ..డీటీఆర్ దెబ్బతిన్న సందర్భాల్లో ఈ మొబైల్ ట్రాలీ వాహనం ద్వారా ట్రాన్స్‌ఫార్మర్లను సులభంగా తరలించి తక్షణమే ప్రత్యామ్నాయ డీటీఆర్‌ను ఏర్పాటు చేయడం ద్వా రా విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు పట్టే సమయం గణనీయంగా తగ్గుతుందన్నారు. ఎస్‌ఈ చెరుకు సంపత్‌రెడ్డి, ఏడీఈలు రణధీర్‌రెడ్డి, స్వామిరెడ్డి, ఏఈలు శివకుమార్, శంకర్ పాల్గొన్నారు.
33 కేవీ ఇంటర్ లింక్ లైన్ ప్రారంభం
రఘునాథపల్లి: మౌలిక సదుపాయాల బలోపేతంలో భాగంగా 33 కేవీ జనగామ ఫీడర్ ట్యాపింగ్ పాయింట్ నుంచి 33/11 కేవీ నిడిగొండ సబ్‌స్టేషన్ వరకు నిర్మించిన 33 కేవీ ఇంటర్ లింక్ లైన్‌ను నిడిగొండ సబ్‌స్టేషన్‌లో టీజీ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్(ఆపరేషన్స్) టి.మధుసూదన్ ప్రారంభించారు. అత్యవసర పరిస్థితుల్లో సాంకేతిక లోపాలు తలెత్తినప్పుడు ప్రత్యామ్నాయ మార్గంలో విద్యుత్ సరఫరా కొనసాగించగలిగే సామర్థ్యం ఈ ఇంటర్‌లింక్ లైన్ ద్వారా ఉంటుందన్నారు. సూపరింటెండెంట్ ఇంజనీర్ సంపత్‌రెడ్డి, ఏడీఈ(కన్‌స్ట్రక్షన్) స్వామిరెడ్డి, రఘునాథపల్లి ఆపరేషన్ ఏడీఈ సుధాకర్, కన్‌స్ట్రక్షన్ ఏఈ రమేశ్, అపరేషన్ ఏఈ రాహుల్ పాల్గొన్నారు.
ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ మధుసూదన్


