జనగామ: నీట్‌తో పాటు సీబీఎస్‌ఈ, ఇతర జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో జరిగిన పేపర్ లీకేజీలకు కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని, నైతిక బాధ్యత స్వీకరిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీలో విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావంగా బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జిల్లా నుంచి భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేపర్ లీకేజీలపై స్వతంత్ర విచారణ కమిటీని ఏర్పాటు చేసి పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని, బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి


