భవన నిర్మాణ నిబంధనలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

భవన నిర్మాణ నిబంధనలు పాటించాలి

Jul 25 2026 1:05 AM | Updated on Jul 25 2026 1:05 AM

జనగామ: మున్సిపాలిటీ పరిధిలో భవన నిర్మాణ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ రాజశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మున్సిపల్‌ కార్యాలయంలో బిల్డర్లు, ప్లానర్లు, వెల్డర్లు, మేసీ్త్రలు తదితరులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో నిర్మాణ అనుమతులు, భద్రతా ప్రమాణాలు, వ్యర్థాల నిర్వహణ, అక్రమ నిర్మాణాల నియంత్రణపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ.. ప్రతీ భవన నిర్మాణం తప్పనిసరిగా మంజూరైన నమూనా ప్రణాళికకు అనుగుణంగానే చేపట్టాలని సూచించారు. ముందస్తు అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని, అలాంటి ని ర్మాణాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

‘డ్రైడే..ఫ్రైడే’ను విజయవంతం చేయాలి

డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టేందుకు ప్రతీ శుక్రవారం నిర్వహిస్తున్న ‘డ్రై డే ఫ్రైడే’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ శాఖ ఆదేశాల మేరకు మున్సిపాలిటీ పరిధిలో ప్రతీ శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వారానికి ఒకసారి నీటి నిల్వ పాత్రలను పూర్తిగా ఖాళీ చేసి శుభ్రం చేయాలన్నారు. పరిశుభ్రమైన పరిసరాలు, ఆరోగ్యకరమైన పట్టణ నిర్మాణం కోసం ప్రతీ పౌరుడు ఈ కార్యక్రమంలో భాగస్వామి కావాలని కోరుతూ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు.

ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు

బిల్డర్లు, ప్లానర్లు, వెల్డర్లు, మేసీ్త్రలతో మున్సిపల్‌ కమిషనర్‌ రాజశేఖర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement