‘ఎస్‌ఐఆర్‌’ గడువులోగా పూర్తిచేయాలి | - | Sakshi
Sakshi News home page

‘ఎస్‌ఐఆర్‌’ గడువులోగా పూర్తిచేయాలి

Jul 25 2026 1:05 AM | Updated on Jul 25 2026 1:05 AM

జనగామ: ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ అత్యంత కీలకమని, మండల అధ్యక్షులు, కోఆర్డినేటర్లు సమన్వయంతో పనిచేస్తూ గడువులోగా వంద శాతం పూర్తి చేయాలని కాంగ్రెస్‌ జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి సూచించారు. నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఎస్‌ ఐఆర్‌ సమీక్ష సమావేశంలో రాష్ట్ర యాదవ కార్పొరేషన్‌ వైస్‌ చైర్మన్‌ భాస్కర్‌ యాదవ్‌తో కలిసి కొమ్మూరి మాట్లాడారు.. నియోజకవర్గంలోని 8 మండలాల్లో ఇప్పటి వరకు ఓవరాల్‌గా 80శాతంకు పైగా నమోదు పూర్తయిందని తెలిపారు. నీట్‌ పరీక్షల వ్యవహారంలో ఢిల్లీలో నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీచార్జి చేయడాన్ని ఖండించారు. కార్యక్రమంలో మండలాల అధ్యక్షులు ఎండీ మసూద్‌, మంజె మల్లేశం, మహదేవుని శ్రీనివాస్‌, శ్రీకాంత్‌, భాస్కర్‌రెడ్డి, శ్రీను నాయక్‌, యాదగిరి, భిక్షపతి, నాయకులు, కౌన్సిలర్లు మేడ శ్రీనివాస్‌, చెంచారపు కరుణాకర్‌రెడ్డి, మల్లారెడ్డి, కొత్త కరుణాకర్‌రెడ్డి, గనిపాక మహేందర్‌, కడారు ప్రవీణ్‌, దత్రపు నరేష్‌, దిడిగ రమేష్‌, మధు, వెంకటరమణ పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కొమ్మూరి ప్రతాపరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement