భూముల రీసర్వే వేగవంతమవ్వాలి | - | Sakshi
Sakshi News home page

భూముల రీసర్వే వేగవంతమవ్వాలి

Jul 24 2026 1:03 AM | Updated on Jul 24 2026 1:03 AM

జనగామ రూరల్‌: భూముల రీసర్వేతో భూ సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అన్నారు. గురువారం మండలంలోని మరిగడి గ్రామంలో జరుగుతున్న భూముల రీసర్వే ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్బంగా ఇప్పటివరకు ఎన్ని ఎకరాలు సర్వే చేశారు? ఇంకా ఎంత చేయాలి? అని రెవెన్యూ, ల్యాండ్‌ అండ్‌ సర్వే అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. భూ సమస్యలకు శాశ్వత పరి ష్కారం చూపించాలన్న లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూముల రీసర్వే ప్రక్రియను ప్రారంభించిందన్నారు. రైతులు వరి పంటపైనే ఆధారపడకూడదన్నారు. కోతుల సమస్య లేకుండా ఉండాలంటే కంది లాంటి పంటలు వేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ గోపీరామ్‌, తహసీల్దార్‌, మహిపాల్‌రెడ్డి, సర్పంచ్‌ కర్రె పర్శరాములు, ల్యాండ్‌ సర్వే ఏడీ పాల్గొన్నారు.

పోర్టల్‌లోనే ఇసుక, మొరం అనుమతులు

ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఇసుక, మొరం అనుమతులు తప్పనిసరిగా ఈ–సాండ్‌ పోర్టల్‌ ద్వారానే పొందాలని టోకెన్‌ విధానం, క్యూఆర్‌ కోడ్‌ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అన్నారు. కలెక్టరేట్‌లో డీసీపీ రాజమహేంద్ర నాయక్‌తో కలిసి మైనింగ్‌, రవాణా, నీటి పారుదల, శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ..ఈ–సాండ్‌ పోర్ట ల్‌ అమలులో రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఇసుక రీచ్‌ల వద్ద పోలీసు, రెవెన్యూ అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ, అక్రమ కార్యకలాపాలను అరికట్టాలని ఆదేశించారు. సమీక్షలో ఏడీ మైన్స్‌ విజయ భారతి, డీపీఓ వెంకట్‌ రెడ్డి, ఆర్టీఓ శిల్ప, నీటిపారుదల శాఖ అధికారి ప్రవీణ్‌, ఏసీపీలు భీంశర్మ, నర్సయ్య, భూ గర్భ జలశాఖ, భగీరథ అధికారులు పాల్గొన్నారు.

ఆరుతడి పంటలను వేయండి

కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement