పాలకుర్తి టౌన్: ‘సర్’ ప్రక్రియను క్షేత్రస్థాయిలో విజయవంతం చేయాలని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పిలుపునిచ్చారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) కార్యక్రమంపై గురువారం మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఆధ్వర్యంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతీ బూత్ స్ధాయిలో సర్ ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని బీఎల్‌ఏలు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. నిర్దేశిత లక్ష్యాన్ని సకాలం పూర్తి చేయాలని ఆమె చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు డైరెక్టర్ లకావత్ లక్ష్మీనారాయణనాయక్, నియోజవర్గ కోఆర్డినేటర్ ప్రమోదర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి


