ఆహార సంస్థలు నిబంధనలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

ఆహార సంస్థలు నిబంధనలు పాటించాలి

Jul 24 2026 1:03 AM | Updated on Jul 24 2026 1:03 AM

జనగామ: జిల్లా కేంద్రంలో హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌, ఇతర ఆహార భద్రతకు సంబంధించి వాటి పరిధిలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ వినీల్‌ తెలిపారు. ‘డేంజర్‌ ఫుడ్‌’ శీర్షికన ఈ నెల 20వ తేదీన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఫుడ్‌సేఫ్టీ అధికారులు స్పందించారు. తనిఖీల సందర్భంగా ఆహార వ్యాపార నిర్వాహకులు తప్పనిసరిగా హెయిర్‌ నెట్‌లు, అప్రాన్‌న్‌లు, గ్లోవ్స్‌ ధరించాలని ఆదేశించారు. వంట నూనెను పదేపదే వినియోగించరాదని హెచ్చరించడంతో పాటు, సంబంధిత అనుమతులు, లైసెన్సులను కూడా పరిశీలించినట్లు పేర్కొన్నారు. నిబంధనలు పాటించని ఆహార వ్యాపార సంస్థలపై చర్యలు తప్పవన్నారు. ఆహార భద్రతపై అవగాహన పెంచేందుకు జిల్లాలోని ఆహార వ్యాపార నిర్వాహకులకు ఫుడ్‌ సేఫ్టీ ట్రైనింగ్‌ అండ్‌ సర్టిఫికేషన్‌ శిక్షణ కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని ప్రణాళిక రూ పొందించినట్లు ఆహార భద్రత అధికారి నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదిక ప్రతిని కలెక్టర్‌కు కూడా పంపించినట్లు తెలిపారు.

సాక్షి ‘డేంజర్‌ ఫుడ్‌’ కథనంపై

స్పందించిన ఆహార భద్రత శాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement