టునా కేజీ @ 600 | - | Sakshi
Sakshi News home page

టునా కేజీ @ 600

Jul 23 2026 1:12 AM | Updated on Jul 23 2026 1:12 AM

జనగామ: పట్టణంలోని కలెక్టరేట్‌ భవన సముదాయం ఎదురుగా బుధవారం అరుదైన టునా చేప విక్రయం స్థానికుల దృష్టిని ఆకర్షించింది. యానాం ప్రాంతం నుంచి తీసుకొచ్చినట్లు విక్రయదారులు తెలిపిన ఈ చేప సుమారు 50 కిలోల బరువు ఉండగా, కిలోను రూ.600 చొప్పున విక్రయించారు. కొత్త రకం సముద్ర చేప కావడంతో దాని రుచి, నాణ్యత గురించి తెలుసుకునేందుకు పలువురు ఆసక్తి చూపగా, భారీగా కొనుగోలు చేశారు. టునా చేప సముద్ర జాతికి చెందిన అధిక పోషక విలువలున్న చేపగా గుర్తింపు పొందింది. దేశీయంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా టునా చేపకు మంచి డిమాండ్‌ ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement