ఎంజీఎం కోల్పోయిన ఆరోగ్యసిరి | - | Sakshi
Sakshi News home page

ఎంజీఎం కోల్పోయిన ఆరోగ్యసిరి

May 31 2026 1:30 AM | Updated on May 31 2026 1:30 AM

– 8లోu

ఆదివారం శ్రీ 31 శ్రీ మే శ్రీ 2026
ఆరోగ్యశ్రీ సేవలందించి క్ల్లెయిమ్‌ చేయని విభాగాలు

రావాల్సిన ఆదాయం

(రూ. లక్షల్లో)

కార్డియాక్‌ అండ్‌ 37

కార్డియోథొరాసిక్‌

కార్డియాలజీ 56

ఈఎన్‌టీ 480

జనరల్‌ మెడిసిన్‌ 227

యూరినరీ 32

మెడికల్‌ అంకాలజీ 672

నెఫ్రాలజీ 47

ఆర్థోపెడిక్‌ సర్జరీ 39

పాలీ ట్రామా 91

ప్లాస్టిక్‌ సర్జరీ 112

సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ 105

సర్జికల్‌ అంకాలజీ 195

కాశిబుగ్గ

ఉత్తర తెలంగాణ జిల్లాలకు ప్రధానంగా ఉన్న వరంగల్‌ నగరంలోని మహాత్మాగాంధీ స్మారక వైద్యశాల (ఎంజీఎం)లో ఆరోగ్యశ్రీ ద్వారా రోగులకు సేవలు అందించిన వైద్యులు, సిబ్బంది వాటి వివరాలను సంబంధిత ట్రస్ట్‌కు పంపడంలో నిర్లక్ష్యం చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. దీనివల్ల సుమారు రూ.8కోట్ల మేర ఆదాయం రాకుండా పోయినట్లు తెలుస్తోంది. ఇందులో ఎంజీఎంలో ఆరోగ్యశ్రీ సేవలందించిన దాదాపు అన్ని డిపార్ట్‌మెంట్లలో వైద్యుల నిర్లక్ష్యం, సిబ్బంది అలసత్వం కనిపిస్తోంది. ఏప్రిల్‌ 1, 2024 నుంచి ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు ఆస్పత్రికి వచ్చిన ఆరోగ్యశ్రీ రోగులకు వివిధ విభాగాల్లో వైద్యులు, సిబ్బంది ఉచితంగా సేవలు అందించారు. ఆయా కేసులకు దాదాపు రూ.8 కోట్ల వరకు ఆదాయం ఆస్పత్రికి రావాల్సి ఉంది. క్లెయిమ్‌ చేసేందుకు ఆయా కేసుల వివరాలు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు పంపాలి. కానీ, ఎవరూ పట్టించుకోలేదు. ఇది వైద్యులు, సిబ్బంది అలసత్వం, ఉన్నతాధికారుల పర్యవేక్షణాలోపం, టెక్నికల్‌ సమస్య వల్ల జరిగినా, ఎంజీఎం ఆస్పత్రికి మాత్రం భారీ నష్టమే వాటిల్లింది. ఈ వ్యవహారంలో ఎంజీఎంలో ఉన్న దాదాపు అన్ని డిపార్ట్‌మెంట్లలో వైద్యుల నిర్లక్ష్యం, సిబ్బంది అలసత్వం కనిపిస్తోందన్న విమర్శలున్నాయి.

మరికొన్ని విభాగాల్లో ఇలా..

డెర్మటాలజీ 2 కేసులకు రూ.70వేలు, గ్యాస్ట్రో ఎంటరాలజీ 33 కేసులకు గాను రూ.5లక్షలు, క్రిటికల్‌ కేర్‌ 2 కేసులకు రూ.2లక్షలు, గైనకాలజీ, సర్జరీ ఒక కేసుకు రూ.15వేలు, ఇన్ఫెక్షన్‌ డిసీజెస్‌ ఒక కేసుకు రూ.9 వేలు, న్యూరాలజీలో 12 కేసులకు రూ.7 లక్షలు, పల్మనాలజీలో మూడు కేసులకు రూ.11 వేలు, రుమటాలజీలో 7 కేసులకు రూ.5 లక్షల చొప్పున, మరికొన్ని కేసులకు రూ.లక్షల్లో ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ నుంచి రావాల్సిన ఆదాయం గడువు దాటిపోవడంతో ల్యాప్స్‌ అయినట్లు సమాచారం.

జనరల్‌ సర్జరీ కేసులు : 1,170 రూ. 2 కోట్లు (రావాల్సిన ఆదాయం)

పలు డిపార్ట్‌మెంట్లకు సుమారు రూ.8 కోట్ల నష్టం

ట్రస్ట్‌కు వివరాలు పంపడంలో

నిర్లక్ష్యం.. లోపించిన పర్యవేక్షణ

గడువు దాటిపోవడంతో

ల్యాప్స్‌ అయినట్లు విమర్శలు

విభాగాలు,

కేసులు

Advertisement
 
Advertisement
Advertisement