జనగామ: కేంద్ర మానవ వనరుల శాఖ విడుదల చేసిన పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ – పాఠశాల విద్య స్థితి (పీజీఐ–డీ) 2024–25 నివేదికలో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానం కైవసం చేసుకుంది. ఆ రు కీలక విభాగాల్లో జిల్లా అద్భుత ప్రతిభ కనబరచడంతో కేంద్ర విద్యాశాఖ నివేదికలో ప్రత్యేకంగా ప్ర స్తావించింది. పాఠశాల విద్య పనితీరు సూచికలో 600 మార్కులకు గాను 357 మార్కులు సాధించి ‘ప్రచేష్ట–1’ గ్రేడ్‌తో తెలంగాణలో మొదటి స్థానంలో నిలిచింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా 788 జిల్లాల్లో జనగామకు 96వ ర్యాంక్ దక్కింది.
ఆరు కేటగిరీల్లో పనితీరు ఇలా..
కేంద్రం నిర్దేశించిన ఆరు కేటగిరీల్లో జిల్లా మెరుగైన ప్రతిభ కనబరిచింది. కేటగిరీల వారీగా చూస్తే..
● అవుట్‌కమ్స్ (290 మార్కులు), లెర్నింగ్ అవుట్‌కమ్స్, యాక్సెస్, టీచర్ అవైలబిలిటీ విభాగంలో 195 మార్కులు సాధించింది.
● ఎఫెక్టివ్ క్లాస్‌రూమ్ ట్రాన్సాక్షన్ (90 మార్కులు), లెర్నింగ్ మేనేజ్‌మెంట్, ఎన్‌రిచ్‌మెంట్ కార్యకలాపాల్లో 57 మార్కులు వచ్చాయి.
● ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫెసిలిటీస్, స్టూడెంట్ ఎంటైటిల్‌మెంట్స్ (51 మార్కులు), మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు సౌకర్యాల కల్పనలో 39 మార్కులు దక్కాయి.
● స్కూల్ సేఫ్టీ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ (35 మార్కులు), పాఠశాలల్లో భద్రత, బాలల రక్షణ చర్యల్లో 15 మార్కులు సాధించింది.
● డిజిటల్ లెర్నింగ్ (50 మార్కులు), డిజిటల్ విద్య అమలులో 18 మార్కులు వచ్చాయి.
● గవర్నెన్స్ ప్రాస్సెస్ (84 మార్కులు), నిధుల వినియోగం, హాజరు పర్యవేక్షణ, స్కూల్ లీడర్‌షిప్ విభాగంలో 33 మార్కులు సాధించింది.
సమష్టి కృషితోనే..
కేంద్ర విద్యాశాఖ వెల్లడించిన పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్‌లో రాష్ట్రంలో జనగామ జిల్లా మొదటి స్థానంలో నిలవడం గర్వకారణం. జిల్లా విద్యాశాఖ, మానిటరింగ్, మండల విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు సమష్టిగా పని చేయడంతోనే ఈ ర్యాంకు రావడానికి ముఖ్య కారణం. రాబోయే రోజుల్లో కూడా జిల్లా విద్యాశాఖ అన్ని రంగాల్లో ముందు వరుసలో నిలిచేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలి.
– రావుల రామ్మోహన్‌రెడ్డి,
డీఎడ్, బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు
మార్కులు
1
జనగామ 357
హనుమకొండ 306
భూపాలపల్లి 295
వరంగల్ 286
ములుగు 266
మహబూబాబాద్ 259
అధికారుల హర్షం
కాగా 2022–23 సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో జిల్లా ఆరో స్థానంలో నిలవగా ఈసారి జిల్లా రాష్ట్ర స్థాయిలో మొదటిస్థానంలో నిలవడంతో కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, మేధావి వర్గం హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 37వేల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ఉపాధ్యాయుల కృషి, అధికారుల పర్యవేక్షణ, ప్రజాప్రతినిధుల సహకారం కీలకంగా నిలిచాయి.
జనగామ పాఠశాల విద్యకు జాతీయ గుర్తింపు
పీజీఐ–డీ 2024–25లో రాష్ట్రంలో మొదటిస్థానం
357 మార్కులతో దేశంలో
96వ ర్యాంకు
ఆరు విభాగాల్లో జిల్లాదే హవా
కేంద్ర మానవ వనరుల శాఖ
నివేదికలో వెల్లడి
10
20
24
29
31


