● జిల్లాకు ప్రభుత్వ విప్
బీర్ల అయిలయ్య
సాక్షిప్రతినిధి, వరంగల్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం (జూన్ 2) సందర్భంగా జిల్లాల్లో జాతీయ పతాకావిష్కరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖులను నియమించింది. హనుమకొండకు రెవెన్యూ గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వరంగల్‌కు అటవీ, పర్యావరణం, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ములుగుకు పంచాయతీరాజ్, గ్రామీణా భివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), జనగామకు ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, జయశంకర్ భూపాలపల్లికి ప్రభుత్వ విప్ శ్రీనివాస్‌రెడ్డి, మహబూబాబాద్‌కు ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్‌లు జాతీయ పతాకాలను ఆవిష్కరించనున్నారు. ముందుగా తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపాల వద్ద పుష్పాంజలి ఘటించనున్నారు.
ధాన్యాన్ని త్వరగా
తరలించాలి
నర్మెట: వర్షాకాలం సమీపిస్తున్నందున కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని కాంటాలు వేసి త్వరగా మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్‌షాలోమ్ అన్నారు. వెల్దండలోని ఐకేపీ కేంద్రంతోపాటు నర్మెట ఉమామహేశ్వర, ఇప్పలగడ్డ జై భవాని ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులను శనివారం ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించడంతో పాటు పలు సూచనలు చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రికార్టులను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. ఆయన వెంట తహసీల్దార్ కలకుంట్ల వెంకట రామానుజాచార్యులు, డీటీ కురికాల వేణు, ఎస్‌ఏ కలాటి యాదయ్య, ఆర్‌ఐ సింగారపు సాయిబాబా, సిబ్బంది ఉన్నారు.
పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి
జనగామ: పొగాకు ఉత్పత్తులకు యువత దూరంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ మల్లికార్జున్‌రావు అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె.మల్లిఖార్జున్‌రావు, జనగామ సీఐ సత్యనారాయణరెడ్డి, విద్యాశాఖ ప్రతినిధి గౌసియాభేగం, ఇతర శాఖల అధికారులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ పొగాకు, పొగాకు ఉత్పత్తుల వినియోగం ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుందన్నారు. యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలు పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలన్నారు. ఈ ర్యాలీలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్లు ఆర్.సుధీర్, ఎల్.అశోక్ కుమార్, కమలహాసన్, యూపీహెచ్‌సీ, బీడీకే వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు.
రైతుల ధాన్యం డబ్బులు త్వరగా జమ చేయాలి
జనగామ రూరల్: మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన మక్కలకు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్ రాజారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం పార్టీ కార్యాలయంలో కావటి యాదగిరి అధ్యక్షతన జిల్లా సమితి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో కుప్పలుగా ఉన్న ధాన్యాన్ని ఐకేపీ, పీఏసీఎస్‌ల ద్వారా కొనుగోలు చేసి గోదాములకు తరలించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాతూరి సుగుణమ్మ, ఆది సాయన్న, ఆకుల శ్రీ నివాస్, చొప్పరి సోమయ్య, జువారి రమేష్, రా వుల సదానందం, తదితరులు పాల్గొన్నారు.


