మెరుగైన ఉపాధి కోసమే జాబ్‌మేళా | - | Sakshi
Sakshi News home page

మెరుగైన ఉపాధి కోసమే జాబ్‌మేళా

May 30 2026 2:50 AM | Updated on May 30 2026 2:50 AM

టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి

పాలకుర్తి టౌన్‌: యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడానికే జాబ్‌మేళా ఏర్పాటు చేసినట్లు టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి తెలిపారు. హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్‌రెడ్డి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలోని శ్రీసోమేశ్వర కల్యాణ మండపంలో మెగా జాబ్‌ మేళా నిర్వహించారు. 38 కంపెనీలు, 2,500 మంది యువత పాల్గొన్న ఈ మేళాను ఝాన్సీరెడ్డి ప్రారంభించారు. పాలకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా హాజరైన యువతకు ఇంటర్వ్యూలు నిర్వహించి, పలు ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఝాన్సీరెడ్డి మాట్లాడుతూ.. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు, నిరుద్యోగ సమస్యలు తగ్గించేందుకు తమ ట్రస్ట్‌ తరపున భవిష్యత్తులోను జాబ్‌మేళాను నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్‌ చైర్‌పర్సన్‌ లావుడియా మంజుల, పాలకుర్తి, తొర్రూరు బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, హమ్యానాయక్‌, పార్టీ మండల అఽధ్యక్షుడు గిరగాని కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement