నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

May 30 2026 2:50 AM | Updated on May 30 2026 2:50 AM

నర్మెట: నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని టాస్క్‌ఫోర్స్‌ కమిటీ తహసీల్దార్‌ కలకుంట్ల వెంకట రామానుజాచార్యులు, ఏఓ అక్కిరెడ్డి కర్ణాకర్‌రెడ్డి హెచ్చరించారు. మండల కేంద్రంలోని వ్యవసాయ ఇన్‌పుట్‌ డీలర్ల షాపులను పోలీసులతో కలిసి శుక్రవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. డీలర్లు వ్యవసాయ శాఖ నిర్ణయించిన మేరకు నాణ్యమైన విత్తనాలు విక్రయించాలన్నారు. తనిఖీ ల్లో ఆర్‌ఐ సాయిబాబా, పోలీసులు ఉన్నారు.

పాలకుర్తిలో..

పాలకుర్తి టౌన్‌: మండల కేంద్రంలోని డీలర్ల దుకాణాలను విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ యూనిట్‌ అధికారులు తనిఖీ చేశారు. ఈసందర్భంగా లైసెన్సులు,రికార్డులు, బిల్లులు, నిల్వలను పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement