జనగామ రూరల్: పట్టణంలోని స్థానిక ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పాలిసెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైందని కళాశాల ప్రిన్సిపాల్ కె.శ్రీనివాస్ తెలిపారు. కౌన్సెలింగ్ మొదటి రోజు 93 మంది విద్యార్థులు హాజరు కాగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేశామని, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. వెరిఫికేషన్ ప్రక్రియలో జె. శ్రీదేవి, రవీందర్ నాయక్, కరుణాకర్, ఎ.కల్పన, కుమారస్వామి, కళావతి, సుజాత, కుమార్ పాల్గొన్నారు.
హెల్త్‌స్కీమ్‌లోని
లోపాలను సవరించాలి
జనగామ రూరల్: ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలులోని లోపాలను సవరించాలని తక్షణం ఉద్యోగులతో చర్చలు జరపాలని టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం టీపీటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఉమాపతి భవన్, రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు ఎ.నరసింహారెడ్డి జెండా ఆవిష్కరించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు ఎన్‌ఎన్ రాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయుల కోసం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన నూతన వైద్య విధానంలో అనేక లోపాలు ఉన్నాయన్నారు. పలు సమస్యలపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపి అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎండీ అంకుశావళి, కుర్రేముల యాదగిరి, బి.లక్ష్మయ్య, వజ్రయ్య, శ్రీహరి, వెంకన్న, కనకయ్య, బి.శ్రీనివాస్, వసంత తదితరులు పాల్గొన్నారు.
జీవనోపాధి రుణాలు సద్వినియోగం చేసుకోవాలి
పాలకుర్తి: మహిళా పొదుపు సంఘాలు జీవనోపాఽధి రుణాలు సద్వినియోగం చేసుకోవాలని ఐలమ్మ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ లావుడ్య మంజుల భాస్కర్ సూచించారు. ఇందిరా మహిళా శక్తి భవనంలో మండలంలోని 120 పొదుపు మహిళా సంఘాలకు రూ.5కోట్ల 20 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం కారుపోతుల వెంకటేశ్వర్లు, పాలకుర్తి సర్పంచ్ కమ్మగాని విజయ నాగన్న, కాకతీయ బ్యాంకు మేనేజర్ సమీరా కుమార్, పీఎన్‌బీ, డీసీసీబీ మేనేజర్లు, మండల మహిళా సంఘం నాయకులు పాల్గొన్నారు.
సేవాభావం ఉన్నవారు
రెడ్‌క్రాస్‌లో చేరాలి
జనగామ రూరల్: సమాజంలో సేవాభావం ఉన్న ప్రతీ ఒక్కరు రెడ్‌క్రాస్‌లో సభ్యులుగా చేరాలని ఆ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ డి. లవకుమార్‌రెడ్డి కోరారు. శుక్రవారం పట్టణంలో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..కార్యవర్గ సభ్యులు జిల్లాలోని వివిధ సంస్థలు వ్యక్తులను ప్రోత్సహించి రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులుగా చేర్పించాలని అన్నారు. జూన్ నుంచి ఆరోగ్య పరీక్ష శిబిరం, విభిన్న అంశాలపై అవగాహన సదస్సులు, జాతీయ పర్వదినాల సందర్భంగా పట్టణంలోని డే కేర్ సెంటర్ సభ్యుల కోసం ప్రత్యేక క్రీడోత్సవాలు ఏర్పాటు చేస్తామన్నారు. రోజు డే కేర్ సెంటర్‌కు రావాలని ఆసక్తి ఉన్నవారు సూపరింటెండెంట్ కన్న పరశురాములు 9396723272 నంబర్‌కు కాల్ చేసి తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. సమావేశంలో కోశాధికారి కుర్రెముల యాదగిరి, వైద్యులు సీహెచ్ రాజమౌలి, ఎల్.లక్ష్మీనారాయణ నాయక్, పుట్ట సత్యం తదితరులు పాల్గొన్నారు.


