● మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదేశం
● ప్రశాంతంగా ఘన్‌పూర్ మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక
స్టేషన్‌ఘన్‌పూర్: మున్సిపాలిటీ సిబ్బందికి ప్రతీ నెలా 1వ తేదీన జీతాలు చెల్లించాలని, సిబ్బంది జీతాల విషయంలో స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ ఇతర మున్సిపాలిటీలకు ఆదర్శంగా ఉండాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదేశించారు. మున్సిపాలిటీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. మొత్తం 18 మంది కౌన్సిలర్లలో 13 మంది అధికార కాంగ్రెస్ పార్టీకి చెందినవారే కావడంతో నలుగురు కోఆప్షన్ సభ్యులు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే ఎన్నికయ్యారు. మున్సిపల్ కోఆప్షన్ సభ్యులుగా బూర్ల లతాశంకర్, గన్ను నర్సింహులు, షేక్ రహమత్‌ఉన్నీషాబేగం, మహమ్మద్ మాషూక్ ఎన్నిక కాగా వారికి మున్సిపల్ కమిషనర్ రాధాక్రిష్ణ నియామకపత్రాలు అందించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్‌కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ సర్వసభ్యసమావేశానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. ఘన్‌పూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్ల సంఖ్య కోఆప్షన్ సభ్యులతో కలుపుకుని 18 నుంచి 22కు పెరిగిందన్నారు. కొత్తగా ఎన్నికై న కోఆప్షన్ సభ్యులకు కౌన్సిల్‌లో ఓటువేసే హక్కు తప్ప కౌన్సిలర్లకు ఉండే అన్ని హక్కులు ఉంటాయన్నారు. కౌన్సిలర్లకు, కొత్తగా ఎన్నిౖకైన కోఆప్షన్ సభ్యులకు జూన్ 15 వరకు ఒక్కొక్క వార్డుకు రూ.10లక్షలు నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నిౖకైన కోఆప్షన్ సభ్యులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ నీల రాజమ్మగట్టయ్య, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.


