సోషల్‌ వెల్ఫేర్‌లో కొత్త టైం టేబుల్‌ | - | Sakshi
Sakshi News home page

సోషల్‌ వెల్ఫేర్‌లో కొత్త టైం టేబుల్‌

May 30 2026 2:50 AM | Updated on May 30 2026 2:50 AM

జనగామ: రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల(టీఎస్‌డబ్ల్యూఆర్‌/రెసిడెన్షియల్‌)రోజువారీ కార్యక్రమ సమయాల్లో కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు అమల్లో ఉన్న సమయాలు, 2026–27 నూతన విద్యాసంవత్సరం నుంచి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు మార్చినట్లు ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన సర్క్యులర్‌లో పేర్కొంది. విద్యార్థుల దైనందిన కార్యక్రమాలు తెల్లవారుజాము 5 గంటలకే ప్రారంభం కానున్నాయి. ఆరోగ్యకరమైన అలవాట్లు, విద్య, క్రీడలు, వ్యక్తిగత సమయం దృష్ట్యా ఈ మార్పులు చేసినట్టు అందులో స్పష్టం చేశారు. ఈ సర్క్యులర్‌కు సంబంధించి అన్ని జోనల్‌ అధికారులు, ప్రిన్సిపాల్స్‌ కొత్త టైం టేబుల్‌ను ఆలస్యం చేయకుండా తక్షణం అమలు చేయాలని ఆదేశించారు. జిల్లాలోని సోషల్‌ వెల్ఫేర్‌ గురుకులాల్లో ఇక నుంచి కొత్త టైం టేబుల్‌ అమలులోకి రానుంది. జిల్లాలో జనగామ, నర్మెట, స్టేషన్‌ ఘన్‌పూర్‌, పాలకుర్తి, జఫర్‌గఢ్‌ మండలాల్లో సోషల్‌ వెల్ఫేర్‌ గురుకులాలు ఉండగా, ఇందులో సుమారు 2,800 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.

ఉదయం 5 నుంచి రాత్రి 9.15 వరకు దినచర్య

ఉదయం 9నుంచి

సాయంత్రం 4.30 వరకు తరగతులు

సెలవు దినాల్లో ప్రత్యేక షెడ్యూల్‌

Advertisement
 
Advertisement
Advertisement