భక్తిశ్రద్ధలతో బక్రీద్‌ | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో బక్రీద్‌

May 29 2026 2:49 AM | Updated on May 29 2026 2:49 AM

జనగామ: బక్రీద్‌ పండుగను జిల్లాలోని ముస్లింలు భక్తిశ్రద్ధలతో గురువారం ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని మసీదుల్లో ముస్లింలు ఉదయం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సిద్దిపేట రోడ్డు ఈద్గా మైదానానికి వందలాదిగా ముస్లింలు చేరుకుని మతపెద్దలు ధార్మి క ప్రసంగాలు విని ప్రార్థనలు చేశారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్‌ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. కలెక్టర్‌ సందీప్‌ కుమా ర్‌ ఝా ఆదేశాల మేరకు ఈద్గా వద్ద మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బాలమణిశ్రీనివాస్‌, కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి మౌలిక సౌకర్యాలు కల్పించారు. ముస్లిం డెవలప్‌మెంట్‌ కమిటీ ప్రతినిధి జమాల్‌షరీఫ్‌, జామియా మజీద్‌ అధ్యక్షుడు మసిఉర్‌ రెహమాన్‌, జమాతే షబాబ్‌ కమిటీ తరపున ఽఅధికారులకు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement