రఘునాథపల్లి: జిల్లాలో ధాన్యం కొనుగోలు, నిల్వ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అదనపు కలెక్టర్ (ఏసీ) బెన్ షాలోమ్ గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఽమండల కేంద్రంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం, పిట్టలగూడెం సమీపంలోని గోదాములను స్వయంగా సందర్శించి పనులను పరిశీలించారు. రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు.
తరిగొప్పులలో..
నర్మెట(తరిగొప్పుల): గోదాముల్లో ధాన్యం నిల్వ చేసే విధానంలో సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ సూచించారు. మండల కేంద్రంలోని పీఏసీఎస్ గోదాంను ఆకస్మికంగా తనిఖీ చేశారు.


