రాష్ట్ర బడ్జెట్‌ 2026–27 | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర బడ్జెట్‌ 2026–27

Mar 21 2026 6:03 AM | Updated on Mar 21 2026 6:03 AM

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్‌లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు మరోసారి నిరాశే ఎదురైంది. శాసనసభలో శుక్రవారం డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన ప్రగతిపద్దుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శాఖల వారీగా నిధులు కేటాయించినప్పటికీ వరంగల్‌ పేరుతో ప్రత్యేకంగా ప్రకటించిన పథకాలు లేకపోవడం గమనార్హం. ఇప్పటికే కొనసాగుతున్న ప్రాజెక్టులకు మాత్రమే పరిమితమైన ఈ బడ్జెట్‌పై ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. పెద్దగా ప్రచారం చేసిన టెక్స్‌టైల్‌ పార్కు, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలకు కేవలం కొనసాగింపు నిధులే కేటాయించగా.. కొత్త పెట్టుబడులు, పరిశ్రమలు, ప్రత్యేక ప్యాకేజీ వంటి అంశాలు పూర్తిగా కనిపించలేదు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ బడ్జెట్‌లో కొత్తగా మెగా ప్రాజెక్టు ఒక్కటి కూడా ప్రకటించకపోవడం.. ప్రత్యక్ష కేటాయింపుల్లో ప్రాధాన్యం దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రం యూనిట్‌గా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళా, రైతు, కార్మికవర్గాలకు ప్రయోజనం కలగనుంది. కాగా, ఈ బడ్జెట్‌లో వివిధ రంగాలకు జరిగిన కేటాయింపుల ద్వారా ఉమ్మడి వరంగల్‌కు రూ.6 వేల కోట్ల నుంచి రూ.7 వేల కోట్ల వరకు పరోక్షంగా లాభం చేకూరనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అంచనాల మేరకు దక్కని ప్రాధాన్యం

కొత్త ప్రాజెక్టులు జీరో..

పాత పనుల కొనసాగింపు

కేటాయింపుల్లో ఉమ్మడి జిల్లాకు ‘ప్రత్యేకం’ లేదు

యూజీడీ, మామునూరు సహా

కీలక ప్రాజెక్టులకు పద్దులు లేవు

అభివృద్ధి, సంక్షేమ పథకాలు

యథాతథం.. ఆరు గ్యారంటీలకు

ఆదరణ

సాగునీరు, వ్యవసాయరంగాలు,

మహిళా సంక్షేమానికి పెద్దపీట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement