ఎడ్లబండికి టోల్‌ట్యాక్స్!
జనగామ ‘పుర’ప్రస్థానం మొదలైందిలా!
జనగామ మున్సిపల్ సమాచారం
కుటుంబాలు: 16,084
2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా: 52,408
ప్రస్తుతం: 80వేలకు పైగానే (అంచనా)
అన్ని విభాగాల్లో ఏటా వచ్చే ఆదాయం: రూ.15.50కోట్లు
ఏటా ఖర్చు: రూ.15కోట్లు
రెగ్యులర్ శానిటేషన్ కార్మికులు: 16 మంది
కాంట్రాక్టు కార్మికులు: 150 మంది
ప్రతీ రోజు చెత్త సేకరణ: 6 టన్నులు
స్లమ్ ఏరియాలు : 19
స్లమ్ ఏరియాలో జనాభా: 22,731 మంది
విస్తీర్ణం: 19.1 చ.కి.మీ
1935లో దేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగించారు. ఒక్క హైదరాబాద్ మినహా(నిజాం పాలనలో ఉండడం చేత) అంతటా లోకల్‌బాడీ ఎన్నికల ద్వారా ప్రజాప్రతినిధుల పాలన అమలులోకి వచ్చింది. దీంతో నిజాం నవాబు బల్దియా (మునిసిపల్) పరిధిలో తహసీల్దార్‌ను చైర్మన్‌గా నియమించి పేరు ప్రఖ్యాతలు ఉన్న ఐదుగురు సభ్యులను నామినేటెడ్‌గా నియమించారు. 17 ఏళ్ల పాటు కొనసాగిన తహసీల్దార్ పాలనకు 1952లో స్వస్తిపలికారు. 1952 నవంబర్‌లో జనగామలో మొదటి సారిగా 14వార్డులకు ఎన్నికలను నిర్వహించారు. వార్డు సభ్యుల ఎన్నికల్లో జనగామ మొదటి చైర్మన్‌గా కోడూరి జగన్నాథరెడ్డి, వైస్ చైర్మన్‌గా పెద్ది నారాయణ ఎన్నికయ్యారు. ఇందులో ముగ్గురు అఫీషియల్స్, మరో ముగ్గురు నాన్‌అఫీషియల్స్‌ను నామినేటెడ్ పద్ధతిలో నియమించారు. రెండో చైర్మన్‌గా రాగి నర్సింహులు ఆ తర్వా త వెన్నెం వెంకటనర్సింహరెడ్డి, వీరారెడ్డి భాస్కర్‌రెడ్డి, చొల్లేటి ప్రభాకర్, పబ్బా శివకోటి, పీటీ దశరథ గెలుపొందారు. ఆరో చైర్మన్‌గా ఎర్రమళ్ల సుధాకర్, ఆ తర్వాత డాక్టర్ కరుణాకర్‌రాజు, వేమెళ్ల సత్యనారాయణరెడ్డి, గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, నాగారపు వెంకట్, పోకల జమున పనిచేశారు.
రూ.36వేల ఆదాయంతో మొదలు..
1952లో 12వేల జనాభా, మూడు వేల నివాస గృహాలతో రూ.36వేల ఆదాయంతో మున్సిపల్ ప్రస్థానం మొదలైంది. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో పట్టణ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. స్వతహాగా నిధులను సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో పెద్దల నిర్ణయం మేరకు సైకిళ్లకు లైఫ్ ట్యాక్స్‌ను అమలులోకి తీసుకొచ్చారు. ఏడాదికి రూ.3 చొప్పున చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే వ్యవసాయ ఉత్పత్తులతో పాటు వ్యాపార పరంగా వివిధ ప్రాంతాల నుంచి జనగామకు వచ్చే ఎడ్లబండ్లు, ఇతర వాహనాలు పట్టణంలోని రావాలంటే టోల్‌ట్యాక్స్ చెల్లించే విధంగా నిబంధనలు విధించారు. ఒక్కో ఎడ్ల బండికి నాలుగు అణా లు టోల్‌కింద తీసుకునే వారు. ప్రతీ ఇంటి యజ మాని ఏడాదికి రూ.5 నుంచి రూ.వెయ్యి వరకు ట్యాక్స్ చెల్లించేవారు. 1964లో అప్పటి చైర్మన్ వెంకటనర్సింహరెడ్డి ఆరు బోర్లను వేయించారు.
ప్రజల అవసరాలు తీర్చినం
పట్టణ ప్రజలు కనీస అవసరాలపై దృష్టి సారిస్తూనే, అభివృద్ధి కోసం దీక్షతో పని చేసినం. వేసవిలో ట్రాక్టర్ల ద్వారా తాగునీటి సరఫరా చేయాలని ప్రభుత్వం నిధులు మంజూరు చేసేది. కానీ నా హయాంలో బోరుబావులు తవ్వించేందుకు నిర్ణయం తీసుకోగా, అప్పటి కలెక్టర్ ససేమిరా అన్నారు. బోరుబావుల అవసరంపై ఆయనకు వివరించి, తాగునీటి సమస్య లేకుండా చేసినం.
– వెన్నెం వెంకటనర్సింహరెడ్డి
నాటి మునిసిపల్ చైర్మన్
చీటకోడూరు రిజర్వాయర్ ఏర్పాటు
పట్టణ ప్రజలకు దాహార్తిని తీర్చాలనే సంక ల్పంతో అప్పటి మంత్రి పొన్నాల లక్ష్మయ్య హయాంలో 2005లో 11.13 ఎంఎల్‌డీ సామర్థ్యంతో చీటకోడూరు వద్ద రిజర్వాయర్ నిర్మించారు. రిజర్వాయర్‌లో ప్రస్తుత నీటి సామర్థ్యం ఆధారంగా, ప్రతీ రోజు తాగునీటిని సరఫరా చేస్తున్నారు.
తహసీల్దార్ పాలన నుంచి
కమిషనర్ వరకు
1952లో రూ.36వేల ఆదాయం
మున్సిపల్ చైర్మన్లుగా 14మంది
నేటికి రాబోవు పాలకవర్గం ఏర్పాటుతో 74 ఏళ్ల చరిత్ర!
ఎడ్లబండికి టోల్‌ట్యాక్స్!
ఎడ్లబండికి టోల్‌ట్యాక్స్!
ఎడ్లబండికి టోల్‌ట్యాక్స్!


